Pineapple Side Effects: పైనాపిల్ ఎక్కువగా తిన్నారో... ఈ వ్యాధుల బారిన పడటం పక్కా!
Side Effect of Pineapple: సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు తింటారు. అయితే వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే ప్రమాదమే. మీరు పైనాపిల్ తినడానికి ఇష్టపడితే, దాని వల్ల కలిగే నష్టాలు కూడా తెలుసుకోవాలి.
What are Side Effects of Pineapple: చాలా మంది వేసవి కాలంలో పైనాపిల్ (Pineapple) తినడానికి ఇష్టపడతారు. కొందరైతే కట్ చేసిన పైనాపిల్ తింటే, మరికొందరు జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది అల్పాహారంలో పైనాపిల్ జ్యూస్ తాగితే, మరికొందరు దీన్ని స్నాక్‌గా తీసుకుంటారు. మీరు పైనాపిల్‌ను అధిక పరిమాణంలో తీసుకుంటున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కువ తినడం వల్ల అనేక సమస్యలు (Pineapple Side Effects) రావచ్చు.
పైనాపిల్ సైడ్ ఎఫెక్ట్స్:
1. పైనాపిల్ లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే అధిక మెుత్తంలో శరీరానికి విటమిన్ సి అందుతుంది. అంతేకాకుండా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.
2. మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్ తినకుండా ఉండాలి. పైనాపిల్లో తీపి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది.
3. దంత సమస్యలతో బాధపడేవారు కూడా పైనాపిల్‌కు దూరంగా ఉండాలి. దీనిలో తీపి ఎక్కువగా ఉండటం వల్ల దంతాలలో సున్నితత్వ సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా దీనిని అతిగా తీసుకోవడం వల్ల క్యావిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి దానిని తీసుకోకుండా ఉంటే మంచిది.
4. పైనాపిల్ తినడం వల్ల చాలా మందికి అలర్జీ సమస్యలు, గొంతు నొప్పి కూడా వస్తాయి. మీరు ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్లయితే, దానిని ఉపయోగించడం ఆపివేసి, మీ వైద్యుడిని సంప్రదించండి.
Also Read; Sandalwood Benefits: చందనం పేస్ట్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook