Diabetes Diet: కొబ్బరి నీళ్లు ఆయుర్వేద ఔషధం కంటే తక్కువేం కాదు. ఆరోగ్యపరంగా కొబ్బరినీళ్ల ప్రయోజనాలు అద్భుతం. వాస్తవానికి చాలా సందర్భాల్లో వైద్యులు సైతం కొబ్బరి నీళ్లను తాగమని సలహా ఇస్తుంటారు. మరి మధుమేహం వ్యాధిగ్రస్థులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా అనేది ఎప్పట్నించో చాలామందికి ఉన్న సందేహం. ఆ వివరాలు మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం వ్యాధిగ్రస్థులు సహజంగానే స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. ఇక కొబ్బరి నీళ్లు కూడా రుచిపరంగా కొద్దిగా స్వీట్‌గా ఉండటంతో మధుమేహం వ్యాధిగ్రస్థులు తినవచ్చా లేదా అనేది అతిపెద్ద సవాలుగా మారింది. కొబ్బరి నీళ్లంటే ఇష్టపడనివారుండరు. వేసవిలో దాహం తీర్చుకునేందుకు ఇంతకుమించింది లేనేలేదు. కొబ్బరి నీళ్లను ఆరోగ్యకరమైన డ్రింక్‌గా పరిగణిస్తారు. ఇందులో సహజసిద్ధమైన షుగర్ ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులు తాగవచ్చా లేదా అనేది చాలామందికి ఉన్న సందేహం. కొబ్బరి నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయా లేదా. ఈ విషయంపై చాలామందిలో భిన్నాభిప్రాయాలున్నాయి. మరి ఏది నిజం ఏది కాదు..


కొబ్బరి నీళ్లను సూపర్ హెల్తీ ఫుడ్‌గా చెప్పవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. అదే సమయంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చు. వేసవికాలంలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా సేవించడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇందులో ఉండే వివిధ రకాల పోషక పదార్ధాలు ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరం. క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగేవారిలో ఎలక్ట్రోలైట్స్ ఇన్‌బ్యాలెన్స్ సమస్య చాలా వరకూ తగ్గిపోతుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. ఎలక్ట్రోలైట్స్ అంటే శరీరానికి శక్తినిచ్చే మినరల్స్.


డయాబెటిస్ రోగులు తాగవచ్చా లేదా


కొబ్బరి నీళ్లలో నేచురల్ షుగర్ ఉన్నందున రుచిపరంగా కాస్త తీపిగా ఉంటాయి. బహుశా అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా అనే సందేహాలు వస్తుంటాయి. డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీళ్లు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తాయనే విషయంలో చాలా అనుమానాలుంటున్నాయి. ప్రముఖ డైటీషియన్లు చెప్పిన వివరాల ప్రకారం కొబ్బరి నీళ్లు మధుమేహం వ్యాధిగ్రస్థులకు ప్రయోజనకరం. తాగినా ఏ విధమైన సమస్య ఉండదు. వాస్తవానికి కొబ్బరి నీళ్లతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చని చాలా జంతువులపై చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కొబ్బరి నీళ్ల గ్లైసోమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులు నిరభ్యంతరంగా కొబ్బరి నీళ్లు సేవించవచ్చు. అయితే రోజుకు ఎంత తాగవచ్చనేది మాత్రం వైద్యుని సలహా మేరకు నిర్ణయించుకోవాలి.


Also read: Healthy Foods: ఈ ఆరు పదార్ధాలు రోజూ తీసుకుంటే చాలు, ఎముకలు, కండరాల నొప్పులు మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook