Healthy Foods: పైకి సాధారణంగా కన్పించినా ఈ సమస్య చాలా తీవ్రమైంది. ఆధునిక జీవన శైలి, జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్లే తరచూ ఎముకలు, కండరాల్లో నొప్పులు వస్తుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలన్నా అదే మార్గం. అంటే ఆహారపు అలవాట్లు మార్చడం. కొన్ని రకాల ఆహార పదార్దాలను డైట్‌లో చేర్చుకుంటే ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆధునిక పోటీ ప్రపంచంలో అనునిత్యం ఎదుర్కొనే ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో ప్రధానంగా వృద్ధాప్యంలో కన్పించే బ్యాక్ పెయిన్, ఎముకలు, కండరాల సమస్యలు యుక్త వయస్సులోనే ఎదురవుతున్నాయి. అందుకే కొన్ని రకాల ఆహారపదార్ధాల్ని రోజూ తీసుకోవడం ద్వారా ఈ సమస్యల్నించి దూరం కావచ్చు. ఇందుకు శరీరానికి ప్రధానంగా కావల్సింది విటమిన్ డి, కాల్షియం. ఈ రెండూ తగిన మోతాదులో ఉంటే ఎముకలు ఆరోగ్యంగానే కాకుండా ధృడంగా ఉంటాయి. దీనికోసం రోజువారీ డైట్‌లో ఈ పదార్ధాలను చేర్చుకుంటే మంచిది...
సాధారణంగా మన చుట్టూ విరివిగా లభించే పదార్ధాల్లోనే శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఉంటాయి. ఎందులో ఏమున్నాయో గుర్తించి తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాము. విటమిన్ డి, కాల్షియం కోసం పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు పాలు లేదా పెరుగు రోజూ తీసుకుంటే శరీరానికి కావల్సినంత కాల్షియం అందుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెబుతోంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎముకల పుష్టికి చాలా దోహదపడతాయి. సాధారణంగా 35 ఏళ్ల వరకే ఎముకల అభివృద్ధి అనేది జరుగుతుంటుంది. ఆ తరువాత ఎముకలు అరిగిపోవడం లేదా క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.
అరటిపండ్లు, డ్రై ఫ్రూట్స్ లాభాలు
విటమిన్ డి, కాల్షియం కోసం అవసరమైన మరో పదార్ధం అరటి పండ్లు. ఇందులో జీర్ణప్రక్రియకే కాకుండా శరీరానికి కావల్సిన మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తింటే శరీరంలోని ఎముకలు పటిష్టమౌతాయి. ఇక రెండవది డ్రై ఫ్రూట్స్. వీటిలో కూడా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండి..ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి. ఎముకలు కాల్షియంను గ్రహించడానికి, నిల్వ ఉంచేందుకు డ్రై ఫ్రూట్స్‌లో ఉండే మెగ్నీషియం కీలకంగా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనాల ప్రకారం..శరీరంలోని మొత్తం పొటాషియంలో కేవలం దంతాలు, ఎముకలే 85 శాతం ఉపయోగించుకుంటాయి.
ఇక ఎముకలు, కండరాల పటిష్టతకు కావల్సిన కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా లభించే మరో పదార్ధం పాలకూర. ఇందులో పెద్దమొత్తంలో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు, దంతాలు బలంగా, పటిష్టంగా మారతాయి. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే కాల్షియంలో 25 శాతం సమకూరుతుందని అంచనా. పాలకూర లేదా ఇతర ఆకుకూరల్లో ఫైబర్‌తో పాటు విటమిన్ ఎ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి కాకుండా తాజా పండ్లు కూడా విటమిన్ డి, కాల్షియంకు మంచి ప్రత్యామ్నాయాలు. ఇందులో ముఖ్యమైంది ఆరెంజ్. ఇందులో పుష్కలంగా లభించే కాల్షియం, విటమిన్ డి సహా ఇతర పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరెంజ్‌లో ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకలకు బలం చేకూర్చుతాయి. ఇక బొప్పాయి గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. బొప్పాయిలో కాల్షియం స్థాయి చాలా ఎక్కువ.100 గ్రాముల బొప్పాయిలో 20 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుందని అంచనా.
Also read: Blood Purification Tips: రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతే ఏం జరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫై ఎలా చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook