Drumsticks: మధుమేహం, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు ఇవన్నీ లైఫ్‌స్టైల్ వ్యాధులు. అంటే జీవన విధానం సరిగ్గా లేకపోవడంతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలివి. అదే సమయంలో లైఫ్‌స్టైల్ సక్రమంగా మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు డైటిషియన్లు, వైద్యులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహారపు అలవాట్లు మారుతున్న కొద్దీ మధుమేహం వ్యాధి గ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహం కారణంగా రక్తంలో చక్కెర శాతం పెరిగి వివిధ రకాల అనారోగ్య పరిస్థితులకు కారణమౌతోంది. అందుకే డయాబెటిస్ ఉన్నప్పుడు డైట్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. ఏవి తినవచ్చు, ఏవి తినకూడదనేది తప్పనిసరిగా లిస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఆహారపు అలవాట్లు ఎంత జాగ్రత్తగా ఫాలో అయితే అంత సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అదే సమయంలో కొన్ని రకాల పదార్ధాలను డైట్‌లో తప్పకుండా చేర్చుకోవాలి. ఎందుకంటే ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలతో మధుమేహం నియంత్రణ సాధ్యమౌతుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. 


మధుమేహం వ్యాధిగ్రస్థులు ఎప్పుడూ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇందుకు అద్భుతమైన ప్రత్యామ్నాయం మనగ కాయ. ఇందులో యాంటీ వైరల్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటి పోషకాలు పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే మునగ కాయల్ని డైట్‌లో చేర్చుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మునగ చెట్టు నుంచి లభించే మునగ కాయ, మునగ ఆకు, మునగ పువ్వు మూడింట్లోనూ ఔషధ గుణాలు చాలా చాలా ఎక్కువ. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు ఈ మూడూ అద్భుతంగా ఉపయోగపడతాయి.


ఎందుకంటే ఇందులో ఇన్సులిన్ వంటి ప్రోటీన్లు ఉంటాయి. ఫలితంగా మధుమేహం ప్రభావం తగ్గుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ సహజంగానే నియంత్రణలో ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా తినకపోయినా వారానికి కనీసం 3-4 సార్లు తీసుకుంటే మంచిది. మునగ కాయ మధుమేహానికి మంచిదని రోజూ తినకూడదు. ఎందుకంటే ఇది చాలా వేడి చేస్తుంది. అదే సమయంలో రక్తపోటు, హార్ట్ బీట్ పెరగవచ్చు. థైరాయిడ్ మందులు తీసుకునేవాళ్లు మునగ కాయలకు దూరంగా ఉండాలి.


Also read: Low BP Remedies: నిర్లక్ష్యం చేస్తే లో బీపీ ప్రాణం తీయవచ్చు, ఈ 3 చిట్కాలతో ఇట్టే మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook