Dates Benefits: చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇక వదిలిపెట్టరు
Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్‌లో ఖర్జూరం అతి ముఖ్యమైంది. ఖర్జూరాన్ని సాధారణంగా హై ప్రోటీన్డ్ ఫుడ్‌గా పిలుస్తారు. అందుకే రోజూ ఖర్జూరం తింటే అన్ని అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dates Benefits: చలికాలంలో సాధ్యమైనంతవరకూ బలవర్ధకమైన ఆహారమే తినాలి. ఎందుకంటే శీతాకాలం వచ్చిందంటే చాలు ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే బలవర్ధకమైన, పౌష్ఘిక పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనికోసం సరైన ప్రత్యామ్నాయం ఖర్జూరం.
ఖర్జూరంలో దాదాపు అన్ని రకాల పోషక విలువలుంటాయి. అంతేకాకుండా ఖర్జూరం స్వభావం వేడి చేసేది కావడంతో చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి వేడి కలుగుతుంది. చలి నుంచి తట్టుకునే సామర్ధ్యం లభిస్తుంది. అదే సమయంలో ఇమ్యూనిటీ పెరగడం వల్ల వివిధ రకాల సీజనల్ వ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు. ఖర్జూరం ఒక్కటే కాదు చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అన్నింటికంటే ముఖ్యంగా ఖర్జూరం తినడం చాలా చాలా అవసరం.
చలికాలంలో రోజూ క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. చాలా వ్యాధులు దూరమౌతాయి. అందుకే శీతాకాలంలో ఖర్జూరం మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తుంది. చలికాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల రక్త నాళాలు సంకోచిస్తుంటాయి. ఫలితంగా రక్తం సరిగ్గా సరఫరా కాదు. ఎప్పుడైతే రక్త సరఫరాలో ఆటంకం కలుగుతుందో రక్తపోటు పెరుగుతుంది. అందుకే హై బీపీ నియంత్రణలో ఉంచేందుకు రోజూ ఖర్జూరం తినడం చాలా మంచిది. రోజూ పరగడుపున తీసుకంటే ఇంకా మంచిది.
శీతాకాలంలో రోజూ ఖర్జూరం తినడం అలవాటు చేసుకుంటే లేదా పాలతో కలిపి తీసుకున్నా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు దూరమౌతాయి. ఖర్జూరంలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కారణంగా ఈ సమస్యలు దూరం చేయవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీని గణనీయంగా పెంచవచ్చు.
కొంతమందికి చలికాలంలో స్వీట్స్ ఎక్కువగా తీసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే డయాబెటిక్ రోగులు స్వీట్స్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అదే ఖర్జూరం తింటే బ్లడ్ షుగర్ పెరగదు. అందుకే డయాబెటిక్ రోగులు కూడా ఖర్జూరం నిస్సందేహంగా తినవచ్చు.
Also read: Tea Side Effects: బీపీ, గుండె వ్యాధిగ్రస్థులు పరగడుపున టీ తాగవచ్చా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook