Tea Side Effects: బీపీ, గుండె వ్యాధిగ్రస్థులు పరగడుపున టీ తాగవచ్చా లేదా

Tea Side Effects: దేశంలో టీ ప్రేమికులు చాలా ఎక్కువ. ఉదయం లేవగానే బెడ్ నుంచే టీ, కాఫీలు తాగందే రోజు మొదలు కాని పరిస్థితి. అయితే పరగడుపున టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా హాని కలుగుతుందంటున్నారు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2023, 03:39 PM IST
Tea Side Effects: బీపీ, గుండె వ్యాధిగ్రస్థులు పరగడుపున టీ తాగవచ్చా లేదా

Tea Side Effects: ఇండియాలో టీ అలవాటు ఎంతగా ఉందంటే కొన్ని లెక్కల ప్రకారం ప్రతి ఇద్దరిలో ఒక వ్యక్తి కచ్చితంగా టీ తాగే అలవాటుండేవాడుంటాడు. ఉదయం లేచినప్పట్నించి రాత్రి పడుకునేవరకూ టీ లేకుండా గడవని పరిస్థితి ఉంటుంది. చాలామందికి ఉదయం ప్రారంభమే టీతో ఉంటుంది. ఈ అలవాటు ఎంతవరకూ మంచిది..

దేశంలో టీ ఎంతగా అలవాటంటే తలనొప్పి వచ్చినా, రిలాక్సేషన్ అయినా, బిజీలో ఉన్నా, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా..అన్నింటికీ టీనే అంటారు. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే టీ అలవాటు మరింతగా పెరిగిపోతుంది. చలెక్కువగా ఉంటే అల్లం టీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే టీ ఇష్టమొచ్చిన సమయాల్లో తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. పరగడుపున తాగడం, నిద్రపోయేముందు తాగడం మంచి అలవాట్లు కానేకావు. చిన్న చిన్న సమస్యల్నించి టీ ఉపశమనం ఎలా కల్గిస్తుందో ఇష్టారాజ్యంగా తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం అంతకంటే ఎక్కువే ఉంటుంది. పరగడుపున టీ తాగడం అస్సలు మంచిది కాదు. 

అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవాళ్లు పరగడుపున టీ తాగవచ్చా లేదా అనేది చాలామందికి సందేహం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఈ రెండు సమస్యలు సర్వ సాధారణంగా ఉంటుంటాయి. ముఖ్యంగా బీపీ రోగులు చాలా అధికంగా ఉంటారు. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. చాలామంది తమ దినచర్యలు టీతో ప్రారంభిస్తుంటారు. బీపీ రోగులు, గుండె వ్యాధిగ్రస్థులు కూడా ఇదే పని చేస్తుంటారు. 

బీపీ రోగులు పాలతో చేసే టీకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పాల టీ తాగడం వల్ల బీపీ మరింత పెరిగిపోతుంది. అంతేకాకుండా గ్యాస్ సమస్య తలెత్తుతుంది. రక్త నాళాలు సంకోచానికి గురవుతాయి. అందుకే పాల టీకు దూరంగా ఉంటే అన్ని రకాలుగా మంచిది. 

రోజూ ఉదయం లేవగానే టీ స్థానంలో గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరం. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గిపోతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు , కైటేచిన్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. బ్లాక్ టీ కూడా మంచి ప్రత్యామ్నాయం.

Also read: Winter Illnesses 2023: జలుబు, దగ్గు, కఫం, అలెర్జీ నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన ఔషధాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News