Garlic Benefits: రోజుకు ఒక్క వెల్లుల్లి రెమ్మ తింటే చాలు..కొలెస్ట్రాల్, బీపీ వంటి సీరియస్ వ్యాధులు మటుమాయం
Garlic Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన పదార్ధాలు చుట్టూ ఉండే ప్రకృతిలో చాలా వరకు ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి వంటింట్లో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఉండే పోషక విలువలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..
ఆయుర్వేదంలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యత, మహత్యముంది. ఆయుర్వేదశాస్త్రం ప్రకారం వెల్లుల్లి ఓ దివ్యౌషధం. రోజూ పరగడుపున క్రమం తప్పకుండా వెల్లుల్లి సేవిస్తే..కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి చాలా సమస్యలకు సమాధానం చెప్పవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
ప్రతి భారతీయుడి వంటింట్లో తప్పకుండా ఉండేది వెల్లుల్లి. వెల్లుల్లి అంటే ఆయుర్వేదం ప్రకారం అద్భుతమైన ఔషధ గుణాలకు ఖజానా. ఇందులో విటమిన్ బి6, పైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి రెమ్మలు 1-2 తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో రుచి కోసం వినియోగిస్తుంటారు. కానీ అదే వెల్లుల్లితో ఆరోగ్యాన్ని అద్భుతంగా పరిరక్షించుకోవచ్చంటున్నారు.
ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ప్రధానంగా ఎదుర్కొనేది జీర్ణక్రియ సంబంధిత సమస్య. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే మలబద్ధకం, గ్యాస్ వంటి ఇతర సీరియస్ సమస్యలు తలెత్తుతాయి. అందుకే ప్రతి రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి రెమ్మలు 1 లేదా 2 తీసుకుంటే గ్యాస్ట్రిక్ పీహెచ్ విలువ మెరుగుపడుతుంది. అటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలుం అల్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వ్యాధుల్ని తగ్గిస్తాయి.
ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే మరో ప్రధాన సమస్య అధిక రక్తపోటు. వెల్లుల్లి సహాయంతో రక్తపోటును తగ్గించవచ్చు. రోజూ ఉదయం పరగడుపున ఒక్క వెల్లుల్లి రెమ్మ తింటే చాలు..రక్తపోటు పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలుంటాయి. మరోవైపు ఇటీవలి కాలంలో అధికంగా కన్పిస్తన్న కొలెస్ట్రాల్ తగ్గించేందుకు వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి రెమ్మల్ని 1-2 తీసుకుంటే కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది.
వీటితో పాటు కిడ్నీ వైఫల్యం, మానసిక ఒత్తిడి దూరం చేయడంలో కూడా వెల్లుల్లి పాత్ర అమోఘమని చెప్పవచ్చు. ఇందులో ఉండే ఎలిసిన్ అనే ఔషధం..కిడ్నీ వైఫల్యం, బ్లడ్ ప్రెషర్, ఆక్సిడేటివ్ ఒత్తిడిని దూరం చేసేందుకు దోహదపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా వెల్లుల్లిని ఇమ్యూనిటీని పెంచేందుకు ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల యాంటీ ఏజీయింగ్ సమస్య కూడా తగ్గుతుంది.
వెల్లుల్లిని పచ్చిగా లేకపోతే కొద్దిగా కాల్చి తింటే చాలా మంచిది. పటుత్వం సమస్య ఉండే మగవారికి వెల్లుల్లి ఓ రామబాణంలా పనిచేస్తుందంటారు ఆయుర్వేద వైద్యులు. పచ్చి వెల్లుల్లి రసాన్ని నొప్పుల్నించి ఉపశమనానికి ఉపయోగించడం అనాదిగా ఉన్న అలవాటు. అంటే స్థూలంగా చెప్పాలంటే వెల్లుల్లితో అన్ని రోగాలు నయమౌతాయి.
Also read: Milk-Dry grapes Benefits: పాలతో ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే అన్ని రోగాలకు చెక్ పెట్టేయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook