Strong Bones: ఎముకలు, కండరాల బలహీనత సమస్యను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల శరీరం మొత్తం బలహీనమైపోతుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఎముకలు పటిష్టంగా, ధృడంగా ఉండటం అవసరం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎముకలు బలంగా ఉండటం లేదు. ఈ క్రమంలో ఎముకలు బలంగా ఉండేందుకు డైట్ మార్చాల్సి ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని పోషక పదార్ధాలు తప్పకుండా డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. సాధారణంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డి తప్పకుండా అవసరమంటారు. కానీ ఈ రెండూ కాకుండా ఇతర న్యూట్రియంట్లు కూడా ఎముకల్ని ధృఢంగా ఉంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.


కాల్షియం, విటమిన్ డి కాకుండా విటమిన్ కే కూడా ఎముకల్ని బలంగా మారుస్తుంది. ఆకు కూరల్లో ఎక్కువగా లభించే విటమిన్ కే శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తాయి. ఇక మరో కీలకమైన మినరల్ జింక్. జింక్ ద్వారా ఎంజైమ్స్ నిర్మాణం సాధ్యమౌతుంది. ఫలితంగా ఎముకల మినరలైజేషన్‌కు దోహదపడుతుంది.


ఇక అన్నింటికంటే ముఖ్యమైంది విటమిన్ సి. ఇది ఎక్కువగా పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. ఇదొక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలు విరగకుండా కాపాడుతుంది. ఎదిగే పిల్లలకు అతి ముఖ్యంగా కావల్సింది ఫాస్పరస్. ఫాస్పరస్ లోపిస్తే బాడీ నిర్మాణంలో సమస్య తలెత్తుతుంది. ఎముకలు అత్యంత బలహీనంగా ఉంటాయి. 


శరీరంలో ఎముకలు ధృడంగా ఉండేందుకు మెగ్నీషియం మరో ముఖ్యమైన మినరల్. ఇది బోన్ మేట్రిక్స్‌లో మిళితమై ఉంటుంది. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. ప్రోటీన్లు కూడా ఎముకల్ని పటిష్టంగా చేస్తాయి. కాల్షియం సంగ్రహణలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్‌ను పెంచడంతో పాటు ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఎముకల పటిష్టతకు కావల్సిన మరో విటమిన్ పొటాషియం. కిడ్నీలో కాల్షియం రిటెన్షన్‌కు పొటాషియం దోహదం చేస్తుంది. అంతేకాకుండా యాసిడ్ లెవెల్ బ్యాలెన్స్ చేసి ఎముకలకు హాని కలగకుండా చేస్తుంది.


Also read: Weight Control: అధిక బరువుతో బాధపడుతున్నారా, ఈ చిట్కాలు పాటిస్తే కేవలం 8 వారాల్లో స్థూలకాయానికి చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook