Blood Sugar Control: మధుమేహాన్ని ఇట్టే నిర్మూలించే ఫ్రూట్, డైట్‌లో తక్షణం చేర్చుకోండి
Blood Sugar Control: ఆధునిక జీవన విధానంలో మధుమేహం అతిపెద్ద సమస్యగా మారింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. కేవలం లైఫ్‌స్టైల్ కారణంగా వ్యాపించే ఈ వ్యాధి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
Blood Sugar Control: డయాబెటిస్ వ్యాధిని ఎంత సులభంగా నియంత్రించవచ్చో నిర్లక్ష్యం వహిస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. మధుమేహం వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. కేవలం నియంత్రణ ఒక్కటే మార్గం కావడంతో లైఫ్‌స్టైల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. అంటే మీ డైట్‌ను మార్చాల్సి ఉంటుంది.
మధుమేహం వ్యాధి చాలా ప్రమాదకరం. రక్తంలో చక్కెర శాతం ఎక్కువైతే చాలా సమస్యలు ఎదురౌతాయి. కిడ్నీలపై నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే డయాబెటిస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు బాగుండాలి. కొన్ని రకాల పండ్లను డైట్ నుంచి దూరం చేయాల్సి వస్తుంది. అదే సమయంలో కొన్ని రకాల పండ్లు తప్పకుండా తినాలి. మధుమేహం నియంత్రణలో పియర్ ఫ్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందనేది తాజా అధ్యయనాలతో తెలుస్తోంది. ఈ ఫ్రూట్ మధుమేహాన్ని నిర్మూలించడమే కాకుండా శరీరానికి కావల్సిన ఎనర్జీని కూడా అందిస్తుంది.
పియర్ ఫ్రూట్‌లో మనిషి శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం కావల్సినంత ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచడంలో దోహదపడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పియర్ ఫ్రూట్‌లో విటమిన్ సి, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయంటారు.
పియర్స్ ఫ్రూట్ తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండటమే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో లిక్విఫైడ్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు శుభ్రమౌతుంది. పేగు సంబంధిత సమస్యల్నించి విముక్తి లభిస్తుంది. పియర్ ఫ్రూట్ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉత్పన్నం కాదు.
పియర్స్ ఫ్రూట్ రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇందులో ఉండే ప్లోసైనిడిన్ యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను హెల్తీగా ఉంచుతాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం సమస్యను చాలావరకూ తగ్గించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంటాయి.
పియర్ ఫ్రూట్‌ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. బరువు తగ్గించుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా బరువు నియంత్రణలో దోహదపడుతుంది.
Also read: Honey Milk Benefits: పాలలో తేనె మిక్స్ చేసుకుని తాగితే ఈ 5 అనారోగ్య సమస్యలకు చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook