Health Tips: మీరు తినే ఆహరంలో ఈ మసాలా దినుసులుంటే చాలు, ఏ వ్యాధి దరి చేరదు.
Health Tips: భారతీయ వంటలకు ఇతర ప్రాంతాల వంటలకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడి వంటల్లో మసాలా దినుసులు విరివిగా ఉపయోగిస్తారు. ఇవి ఆహార పదార్ధాలకు రుచి అందించడమే కాకుండా ఆరోగ్యకరంగా చాలా ప్రయోజనాలు కల్గిస్తాయి.
Health Tips: మసాలా దినుసులు. భారతీయ వంటల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి ఎప్పుడూ. ఇవి లేకుండా వంటలు ఉండవంటే అతిశయోక్తి కానేకాదు. వీటిని కేవలం రుచి కోసమే వినియోగిస్తుంటారంటే పొరపాటే. మసాలా దినుసులు స్పైసీగా ఉన్నా ఆరోగ్యపరంగా చాలా మంచివి.
భారతీయులు వంటల్లో వివిధ రకాల మసాలా దినుసులు వినియోగిస్తుంటారు. ఇవి మన తినే ఆహారం రుచిని పెంచడంతో పాటు శరీరానికి ఆరోగ్యపరంగా మేలు చేకూరుస్తాయి. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసులు తప్పకుండా వినియోగించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల మసాలా దినుసులతో ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి.
సోంపు
సోంపును తాలింపు కోసం చాలా పదార్ధాల్లో వినియోగిస్తుంటారు. ఇది రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండేలా చేస్తుంది. అందుకే సోంపు ఆహార పదార్ధాల్లో తప్పకుండా ఉండాల్సిందే. ఒకవేళ ఆహారంతో పాటు లేకపోతే భోజనం తరువాత కొద్గిగా నమిలి తినడం మంచి అలవాటు.
జీలకర్ర
జీలకర్ర కేవలం తాలింపు కోసమే కాకుండా చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది కూడా తినే ఆహార పదార్ధాలకు రుచి పెంచుతుంది. దాంతో పాటు తినే ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. జీలకర్ర పౌడర్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీరా వాటర్ కూడా చాలా రకాల సమస్యలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
హీంగ్
పప్ప్పల్నించి అన్ని పదార్ధాల్లోనూ తాలింపులో హీంగ్ తప్పకుండా వినియోగిస్తారు. తమిళనాడు ప్రాంతంలో అయితే రోజూ తప్పకుండా తీసుకునే సాంబారు హీంగ్ లేకుండా ఉండదు. కడుపులో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలుంటే దూరం చేస్తుంది. కడుపు సంబంధిత వ్యాధుల్నించి ఉపశమనం పొందేందుకు హీంగ్‌ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.
Also read: Health Tips: మలబద్ధకం, అజీర్తి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు
వాము
వాము కూడా రుచి కోసం చాలా పదార్ధాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే వాముతో ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. వాముని బరువు తగ్గించే ప్రక్రియలో, జలుబు నుంచి ఉపశమనం పొందేందుతు వినియోగిస్తుంటారు. స్పైసీ ఆహారం తినాలనుకుంటే వాము వేస్తే సరిపోతుంది. స్పైసీతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. రోజూ పరగడుపున వాము నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలున్నాయి.
Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook