Grapes Benefits: రోజూ ద్రాక్ష పండ్లు తింటే..కేన్సర్ సహా ఈ 5 రకాల వ్యాధులు దూరం
Grapes Benefits: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. ముఖ్యంగా పండ్లు. పండ్లలో అద్భుతమైన పోషక విలువలుంటాయి. ఇవి బాడీని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Grapes Benefits: ప్రకృతిలో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సీజనల్ కాగా మరి కొన్ని ఏడాది పొడుగనా లభిస్తుంటాయి. పండ్లు ఏవైనా సరే ఆరోగ్యరీత్యా అద్భుతమైనవే. ఇందులో ఉండే పోషకాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది ద్రాక్ష పండ్ల గురించి. ఒక్క ద్రాక్షపండ్లతో చాలా రకాల వ్యాధులు దూరం చేయవచ్చంటున్నారు న్యూట్రిషనిస్టులు.
ద్రాక్షలో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంతో ద్రాక్ష పండ్లకు మించింది లేదంటారు. ద్రాక్ష పండ్లు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి మనిషి శరీరానికి చాలా ప్రయోజనకరం. ద్రాక్ష పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బితో పాటు పొటాషియం, కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి. ఇవి కాకుండా ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా లాభదాయకం. ద్రాక్ష పండ్లలో కేలరీలు, ఫైబర్, గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ కూడా ఉండటం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
ద్రాక్ష పండ్లు రోజూ తినడం వల్ల గుండె వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా బ్రెస్ట్ కేన్సర్ నియంత్రణలో ద్రాక్ష పండ్లు అద్బుతంగా ఉపయోగపడతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ద్రాక్ష పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటికి చాలా మంచిది. కంటికి సంబంధించిన సమస్యలుంటే ద్రాక్ష పండ్లను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
మధుమేహం వ్యాధిగ్రస్థులకు కూడా ద్రాక్ష పండ్లు చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు దోహదం చేస్తాయి.
ద్రాక్ష పండ్లలో గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ద్రాక్ష పండ్లు తింటే టీబీ, కేన్సర్, బ్లడ్ ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధుల్ని దూరం చేయవచ్చు. కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధిని దూరం చేసేందుకు ద్రాక్ష అద్భుతంగా ఉపయోగపడుతుంది.
చాలామందికి చర్మ సంబంధిత ఎలర్జ ఉంటుంది. ద్రాక్షలో ఉండే యాంటీ వైరల్ గుణాలు స్కిన్ ఎలర్జీని దూరం చేయడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాల కారణంగా పోలియో, వైరస్ వాటితో పోరాడే సామర్ధ్యం లభిస్తుంది.
Also read: Calcium Rich Foods: క్యాల్షియం లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు.. క్యాల్షియం అధిక మోతాదులో ఉండే ఫుడ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook