Diabetes Tips: డయాబెటిస్ అనేది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతోంది. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. జీవనశైలి వ్యాధి కావడంతో నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మన ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ వ్యాధి ఎంత సాధారణంగా కన్పిస్తుందో అంతే ప్రమాదకరం. ఒకసారి సోకిందంటే ఇక జీవితాంతం వదలదు. అంటే మధుమేహానికి శాశ్వత చికిత్స లేదు గానీ నియంత్రణ మాత్రం సాధ్యమే. ఈ క్రమంలో డైటింగ్ అనేది చాలా ముఖ్యం. డైటింగ్ ఎంత పగడ్బందీగా ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అంతలా నియంత్రణలో ఉంటాయి. మధుమేహం నియంత్రణలో లేకపోతే కిడ్నీ, గుండెపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే ఆహారపు అలవాట్లపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. ఏది తినాలి, ఏది తినకూడదనేది తెలుసుకోవాలి. 


మధుమేహం వ్యాధిగ్రస్థులు డైటింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం మంచి అలవాటు కాదు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒకసారి పెరిగితే నియంత్రణ కష్టమౌతుంది. అందుకే ప్రతిరోజూ డిన్నర్ తరువాత 15 నిమిషాలు తప్పకుండా లైట్ వాక్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. స్థూలకాయం కూడా ఉండదు. గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఇతర రోగాల్నించి కూడా కాపాడుకోవచ్చు. రాత్రి భోజనం 7-8 గంటల్లోపు పూర్తి చేసి 2 గంటల తరువాత అంటే 9-10 గంటలకు నిద్రపోవాలి. ఆరోగ్యం కోసం, మధుమేహం నియంత్రణకు ఇది మంచి అలవాటు.


మధుమేహం వ్యాధిగ్రస్థులు తప్పకుండా గుర్తుంచుకోవల్సిన అంశం మరొకటి ఉంది. బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉండాలంటే పగలు కొద్దిపాటి గ్యాప్ తీసుకుంటూ ఏదో ఒకటి తినాలి. అంటే ఆకలితో ఉండకూడదు. అయితే కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవల్సి ఉంటుంది. దీనికోసం పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, హెల్తీ ఫుడ్స్ డైట్‌లో ఉండాలి. మద్యం, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 


లంచ్ లేదా డిన్నర్ తరువాత కాస్సేపు లైట్ వాక్ చేస్తే సరిపోదు. ప్రతిరోజూ వాకింగ్ తప్పనిసరి. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.


Also read: Garlic Benefits: రోజూ పరగడుపున పచ్చి వెల్లుల్లి రెమ్మలు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook