Garlic Benefits: రోజూ పరగడుపున పచ్చి వెల్లుల్లి రెమ్మలు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే

Garlic Benefits: ప్రతి భారతీయుని ఇంట్లో లభించే వివిధ పదార్ధాలకు ఆయుర్వేదంలో విశిష్ట ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇందులో అతి ముఖ్యమైంది వెల్లుల్లి. వెల్లుల్లిని ఆయుర్వేద ఖజానాగా పిలుస్తారు. వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు వింటే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 28, 2023, 08:51 PM IST
Garlic Benefits: రోజూ పరగడుపున పచ్చి వెల్లుల్లి రెమ్మలు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే

Garlic Benefits: ఆయుర్వేదశాస్త్రంలో వెల్లుల్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఓ సామెత ఉంది. అంటే అన్ని అద్భుత ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లిని క్రమపద్ధతిలో తీసుకుంటే చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. వెల్లుల్లిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

వెల్లుల్లి అనేది వాస్తవానికి ఓ మసాలా దినుసు. ప్రతి భారతీయుడి కిచెన్‌లో తప్పకుండా ఉంటుంది. కూరల్లో, తాలింపుల్లో, ఇతర వంటల్లో తప్పకుండా వినియోగిస్తారు. వంటల రుచి పెంచేందుకు వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి స్వభావం వేడి చేసేదిగా ఉంటుంది. అందుకే మితంగానే తీసుకోవాలి. ఇందులో న్యూట్రియంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిని ఇమ్యూనిటీ పెంచేందుకు అద్భుతంగా ఉపయోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. రోగ నిరోధక శక్తి పెరగడంతో వివిధ రకాల అంటువ్యాధుల ముప్పు తగ్గుతుంది. అయితే వెల్లుల్లితో ఈ  ప్రయోజనాలు పొందాలంటే రోజూ క్రమం తప్పకుండా ఉదయం వేళ పరగడుపున కేవలం 1-2 రెమ్మలు తీసుకుంటే చాలు. 

వెల్లుల్లి రెమ్మల్ని రోజూ పరగడుపున తీసుకుంటే మానసిక సమస్యలు కూడా దూరమౌతాయి. వెల్లుల్లితో డిప్రెషన్ దూరమై మానసిక ఆరోగ్యం కలుగుతుంది. వెల్లుల్లి సహాయంతో మానసిక ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. ఒత్తిడిని జయించే సామర్ధ్యం కలుగుతుంది. ఒత్తిడి నుంచి రక్షించుకోవాలంటే వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

వెల్లుల్లితో కలిగే మరో అద్భుత ప్రయోజనం డయాబెటిస్ నియంత్రణ. మధుమేహం నియంత్రించేందుకు వెల్లుల్లి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ అనే కాంపౌండ్ ఇందుకు దోహదపడుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులు ప్రతిరోజూ ఉదయం పరగడుపున 1-2 వెల్లుల్లి రెమ్మల్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

వెల్లుల్లిని ఆయుర్వేదపరంగా అద్భుతమైన ఔషధంలా భావిస్తారు. కేన్సర్ నుంచి రక్షించేందుకు వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కేన్సర్ ముప్పును తగ్గిస్తాయి. అయితే ప్రతిరోజూ ఉదయం పరగడుపున 1-2 వెల్లుల్లి రెమ్మల్ని తినాల్సి వస్తుంది. 

వెల్లుల్లి బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున పచ్చి వెల్లుల్లి రెమ్మల్ని తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా బరువు వేగంగా తగ్గించుకోవచ్చు. ఇందులోని కొన్ని పోషకాలు శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది. అందుకే వెల్లుల్లిని ఆయుర్వేదపరంగా ఓ ఖజానాగా భావిస్తారు. తీవ్రమైన వ్యాధుల్ని కూడా వెల్లుల్లి సహాయంతో నిర్మూలించవచ్చు. 

Also read: Weight Loss Tips: అధిక బరువుతో బాడీ షేప్ అవుట్ అయిందా, ఈ ఫ్రూట్ రోజూ తిని చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News