Kidney Health Tips: మీ లైఫ్‌స్టైల్ ఇలా మార్చుకుంటే..కిడ్నీ సమస్యలు దూరం
Kidney Health Tips: శరీరంలో అతి ముఖ్యమైన కిడ్నీ. గుండె ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం కిడ్నీలు. అందుకే కిడ్నీలు సాధ్యమైనంతవరకూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..
మనిషి శరీరంలో గుండెతో పాటు కిడ్నీలు, లివర్ చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు తలెత్తనంతవరకూ సాధారణంగా కిడ్నీల మహత్యం తెలియదు. శరీరంలోని విష పదార్ధాలను తొలగించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎన్నో ప్రమాదకర వ్యాధుల్నించి కాపాడుకోగలం. ఒక్క కిడ్నీ పాడయితే శరీరం మొత్తం ప్రభావితమౌతుంది. ప్యత్యేకించి ఎసిడిటీ, అధిక రక్తపోటు ముప్పు పెరుగుతుంది. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..మీ జీవనశైలి కచ్చితంగా మారాల్సిందే.
కిడ్నీల సంరక్షణకు ఏం చేయాలి
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముందుగా మీ రెగ్యులర్ డైట్ నుంచి ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి పదార్ధాలను దూరం చేయాలి. ఆహారంలో హెల్తీ ఫుడ్స్, ప్రోటీన్లు, డైట్, తృణ ధాన్యాలు, ఫైబర్ ఆధారిత పదార్ధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మద్యపానంకు దూరం
మద్యపానం అనేది ఓ సామాజిక రుగ్మత. అంతేకాకుండా ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా ఆందరూ మద్యపానం బారిన పడుతున్నారు. ఇది కేవలం కిడ్నీలనే కాకుండా..శరీరం మొత్తాన్ని బలహీనపరుస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మద్యపానంకు దూరంగా ఉండాలి.
సరిపడినంత నీరు తాగడం
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీ సమస్యలుంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. శరీరంలో నీటి శాతం తక్కువ కాకుండా చూసుకోవాలి.
ఉప్పు తగ్గించడం
ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే సోడియం ఎక్కువైతే కిడ్నీ సమస్య తలెత్తుతుంది. దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్, ప్రోసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
టీ-కాఫీలు తగ్గించడం
ఇండియాలో టీ, కాఫీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు ట్రీ ప్రియులు. ఇందులో ఉండే కెఫీన్ అనే పదార్ధం కిడ్నీలకు మంచిది కాదు. కిడ్నీ సమస్యలకు కారణమౌతుంది. ఫలితంగా కడుపులో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది.
Also read: Vitamin A: విటమిన్ ఎ లోపంతో కలిగే తీవ్ర వ్యాధులేంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook