Foods to Control Uric Acid in Body: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో వివిధ అంశాలు తగిన మోతాదులో ఉండాలి. ఏవి లోపించినా, ఏవి అధికమైనా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అదే క్రమంలో యూరిక్ యాసిడ్ పెరగడం అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. మీక్కూడా ఇదే పరిస్థితి తలెత్తితే కొన్ని రకాల పదార్ధాలు తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎప్పుడూ మితంగా ఉండాలి. పెరిగితే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ఆర్థరైటిస్ వంటి సమస్య పెరుగుతోంది. శరీరంలోంచి హానికారకమైన విష పదార్ధాలు బయటకు వెళ్లకపోతే యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంటుంది. జాయింట్స్ లో గౌట్ ఏర్పడి తీవ్రనొప్పికి కారణమౌతుంటుంది. అందుకే రోజూ డైట్‌లో కొన్ని పదార్ధాలు తప్పకుండా ఉండేట్టు చూసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించవచ్చు.


చెర్రీ


చాలామంది చెర్రీ ఫ్రూట్స్‌ను కేక్ లేదా డిష్ డెకరేషన్ కోసం వినియోగిస్తుంటారు. కానీ చెర్రీస్ ఎంత రుచికరంగా ఉంటాయో అంతే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. చెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. యూరిక్ యాసిడ్ కారణంగా తలెత్తే జాయింట్ పెయిన్స్  తగ్గుతాయి.


టొమాటో


టొమాటో అనేది ప్రతిరోజూ వంటల్లో తప్పకుండా ఉపయోగించే అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఓ కూరగాయ. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో టొమాటో అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే టొమాటోలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.


Also Read: Diabetes Diet Fruits: మధుమేహం వ్యాధిగ్రస్థులు మామిడి పండ్లు తినవచ్చా లేదా


డార్క్ చాకొలేట్స్


శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు డార్క్ చాకొలేట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే లిథోబ్రోమైన్ ఆల్కలాయిడ్ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు దోహదపడుతుంది. అయితే డార్క్ చాకొలేట్స్‌లో షుగర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. 


ఆరెంజ్


విటమిన్ సి సమృద్ధిగా లభించే ఆరెంజ్ క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. రోజుకు 500 మిల్లిగ్రాముల విటమిన్ సి ఉన్న పదార్ధాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యే తలెత్తదు. ఆరెంజ్‌తో పాటు నిమ్మ కూడా మంచి ప్రత్యామ్నాయం. 


ఫైబర్ ఫుడ్స్


మరీ ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫైబర్ ఆధారిత ఫుడ్స్‌లో గ్రెయిన్స్, ఓట్స్, బ్రోకలీ, వాము, ఆనపకాయ వంటివి ఉన్నాయి.


Also Read; Cholesterol Signs: మీలో ఈ లక్షణాలు కన్పిస్తే అలర్ట్ అవాల్సిందే, కొలెస్ట్రాల్ సంకేతాలివి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook