Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది సాధారణ సమస్యే అయినా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇది శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే ఆర్థరైటిస్, రీనల్ కోలిక్, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలు బాధిస్తుంటాయి. అయితే కొన్ని పదార్ధాలను డైట్‌లో చేర్చడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. యూరిక్ యాసిడ్ సమస్యను దూరం చేసే ఆ పదార్ధాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్రూట్ సలాడ్


వివిధ రకాల ఫ్రూట్ సలాడ్ యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించేందుకు దోహదపడుతుంది. సలాడ్‌లో పుచ్చకాయ, దోసకాయ, మామిడి, అరటి, ఆరెంజ్, యాపిల్ వంటి పండ్లు తప్పకుండా ఉండాలి. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తాయి. 


యాపిల్


యాపిల్ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు పెద్దలు. ఆరోగ్యపరంగా ఆపిల్‌కు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే మలిక్ యాసిడ్ మొటిలిటీని తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.


తృణ ధాన్యాలు


తృణ ధాన్యాలు విస్తృతంగా తీసుకునేవారిలో యూరిక్ యాసిడ్ చాలా తక్కువగా ఉత్పన్నమౌతుంది. ఒకవేళ అప్పటికే యూరిక్ యాసిడ్ ఉంటే తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఏదోరూపంలో ఏవో ఒక తృణ ధాన్యాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.


టొమాటో-కీరా


టొమాటో యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు కీరాను కలిపితే ఇంకా మంచి ఫలితాలుంటాయి. కీరాలో ఉండే వాటర్ యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు ఉపకరిస్తుంది. 


జైతూన్ ఆయిల్


జైతూన్ ఆయిల్ అన్నింటికంటే అద్భుతమైంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, ఇ పుష్కలంగా లభిస్తాయి. జైతూన్ ఆయిల్‌ని చాలా ఆయుర్వేద వైద్య విధానాల్లో ఉపయోగిస్తారు. 


పెరుగు


పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే రోజుకు కనీసం ఒకసారి పెరుగన్నం తినాలంటారు పెద్దలు. పెరుగులో ఉంటే ప్రో బయోటిక్స్ ప్రేవుల్ని శుభ్రపర్చడమే కాకుండా యూరిక్ యాసిడ్‌ను తక్షణం తగ్గించడంలో దోహదపడుతుంది.


పప్పులు


పప్పుల్లో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను తగ్గించడంలో దోహదమౌతుంది.


Also read: Detox Tips: డీటాక్స్ అంటే ఏంటి, శరీరాన్ని డీటాక్స్ చేసే సులభమైన పద్ధతులివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook