Pre Diabetes: డయాబెటిస్ అనేది సాధారణంగా లైఫ్‌స్టైల్ మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వస్తుంది. జెనెటిక్ అంటే వంశపారంపర్యత కూడా డయాబెటిస్ కారణాల్లో ఒకటి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇండియాను డయాబెటిస్ రాజాధానిగా పిలుస్తారు. సకాలంలో మధుమేహం చికిత్స చేయించుకోకుంటే ప్రాణాలు కూడా పోవచ్చు. శరీరంలో డయాబెటిస్ ముందుగా ప్రీ డయాబెటిస్ లక్షణాలు కన్పిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహాన్ని డయాబెటిస్ మెలిటస్ అని కూడా పిలుస్తారు. ఇది మెటబోలిజం సంబంధింత ప్రాణాంతక వ్యాధి. ఈ స్థితిలో బ్లడ్ షుగర్ నియంత్రణ కాదు. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ సాధారణం దాటి వెళ్లిపోతుంటాయి. ఈ వ్యాధి కారణంగా శరీరంలో సీరియస్ వ్యాధులు కూడా ఉత్పన్నమౌతాయి. గుండె వ్యాధుల ముప్పు కూడా మధుమేహం వల్లనే పెరుగుతోంది. 


ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి


ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ బోర్డర్‌లో ఉండటమే. అంటే జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మధుమేహం ముప్పు పెరిగిపోతుంది. టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరగవచ్చు. ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా ప్రీ డయాబెటిక్ స్థితిని అరికట్టవచ్చు. బ్లడ్ షుగర్ అనేది ఫాస్టింగ్ అయితే 100-126 వరకూ ఉండవచ్చు. అదే పోస్ట్ లంచ్ అయితే 140-200 వరకూ ఉండవచ్చు. 


హెల్తీ ఫుడ్స్ తీసుకోవడమే కాకుండా జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల వ్యాధుల్ని దూరం చేయవచ్చు. ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ప్రీ డయాబెటిస్ ముప్పును తొలగించవచ్చు. రోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ప్రయోజనాలుంటాయి. శరీరంలో చాలా వ్యాధుల్ని దూరం చేయవచ్చు. ఎప్పుడూ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఫైబర్ ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, ఆకు కూరలు తినడం చేయాలి.


చిప్స్, హాట్ , బిస్కట్స్ వంటి ప్రోసెస్డ్ ఫుడ్స్ ముట్టకూడదు. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. సోడియం, పంచదార, అధిక కార్బోహైడ్రేట్ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.


Also read: Cholesterol Diseases: శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే ఈ 4 ప్రాణాంతక వ్యాధులున్నట్టే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook