Cholesterol Diseases: మనిషి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్. దీనినే హెచ్‌డీఎల్ అంటారు. రెండవది చెడు కొలెస్ట్రాల్. దీనినే ఎల్‌డీఎల్ అని పిలుస్తారు. మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే ఎల్‌డీఎల్ మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ ఉందంటే నాలుగు రకాల వ్యాధుల మప్పు ఉన్నట్టేనంటన్నారు ఆరోగ్య నిపుణులు.
కొలెస్ట్రాల్ అనేది సాధారణంగా రక్తంలో ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యకరమైన కణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అయితే ఇది నిర్ణీత మోతాదు కంటే ఎక్కువ కాకూడదు. 200 mg/dl కంటే ఎక్కువ ఉండటం మంచిది కాదంటారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే దానికిని సైలెంట్ కిల్లర్ అని పరిగణిస్తారు. ఎందుకంటే బయటకు ఏ లక్షణాలు కన్పించకపోయినా ఒకేసారి ప్రమాదకరమైన గుండె వ్యాధులు ఎదురుకావచ్చు.
కొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్షించేందుకు నిర్ణీత సమయంలో అంటే ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటే కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. తద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు. చెడు జీవనశైలి అలవాట్లు స్మోకింగ్ , మద్యపానంకు దూరంగా ఉండాలి. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చాలా అవసరం. అంతేకాకుండా తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికి చేరుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్, గుండె రక్తాన్ని పంపే చేసే సామర్ధ్యం తగ్గిపోవడం వంటివి ఎదురుకావచ్చు. రక్తం చిక్కగా మారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఆక్సిజన్ తగ్గడంతో ప్రాణాలు పోయే ప్రమాదముంది. బ్రెయిన్‌లో క్లాటింగ్ సమస్య ఉత్పన్నం కావచ్చు. దాంతో స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది.
కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. దీనివల్ల ఎథెరోస్కెలెరోసిస్, ధమనుల్లో ప్లక్ ఏర్పడటం వంటివి ఉత్పన్నమౌతాయి. ఈ రెంటి వల్ల బ్లాకేజెస్ ఏర్పడతాయి. ధమనుల ద్వారా గుండె కణాల్లో రక్తం, ఆక్సిజన్ చేరుతుంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఈ ప్రక్రియలో ఆటంకం ఏర్పడుతుంది. దీనినే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ప్లక్ ఏర్పడటం వల్ల దమనులకు హాని కలుగుతుంది. ఇది కాస్తా రక్త సరఫరాను నిలువరిస్తుంది. ఆక్సిజన్ పంపిణీలో ఆటంకం ఏర్పడవచ్చు. గుండెకు పోషకాలు అందించే కొరోనరీ ఆర్టరీస్‌లో ఈ సమస్య తలెత్తవచ్చు. దాంతో గుండె బలహీనమై రక్తం సరిగ్గా పంపింగ్ కాదు. దాంతో హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇక కొలెస్ట్రాల్ కారణంగా తలెత్తే అతి మఖ్యమైన సమస్య రక్తపోటు. అధిక రక్తపోటు సమస్యగా మారుతుంది. ధమనుల్లో ప్లక్ ఏర్పడటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా కాదు. దాంతో ఒక్కొక్క అవయవం పాడవుతుంటుంది.
Also read: Main Causes Of Belly Fat: బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది? పెరడానికి ప్రధాన కారణాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook