Insomnia: ఆధునిక జీవనవిధానంలో బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామందికి నిద్ర అనేది సరిపడటం లేదు. మరి కొందరికి నిద్రలేమి వెంటాడుతుంటుంది. రోజుకు కావల్సినంత నిద్రలేకపోతే ఆరోగ్యపరంగా తీవ్ర ప్రభావం పడుతుంది. తీవ్ర ప్రతికూల పరిణామాలు కన్పిస్తాయి. అసలు రోజుకు నిద్ర ఎంతసేపుండాలి. రోజుకు 5 గంటల నిద్ర కూడా లేకుంటే ఎలాంటి భయంకర పరిణామాలు కలుగుతాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి కారణంగా ఎదుర్కొనే పని ఒత్తిడి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టక, నిద్ర సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది. ప్రశాంతమైన నిద్ర అనేది మనిషి చాలా అవసరం. రోజుకు ఒక ఆరోగ్యకరమైన మనిషికి 8 గంటలు నిద్ర ఉండాల్సిందే. అప్పుడే మనిషి శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కొంతమందికి నిద్రకై తగిన సమయం లభిస్తుంది. మరి కొందరికి బిజీ లైఫ్ కారణంగా నిద్ర పోయేందుకు సమయమే దొరకదు. రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే శరీరంలో ఎలాంటి ప్రతికూల పరిణామాలు కలుగుతాయో చూద్దాం..


మధుమేహం ముప్పు


ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తూ భయపెడుతున్న వ్యాధి డయాబెటిస్. మధుమేహానికి కారణమయ్యే వివిధ కారణాల్లో ప్రధానమైంది రోజుకు తగిన నిద్ర లేకపోవడం.  రోజుకు కావల్సినంత అంటే 8 గంటల నిద్ర లేకుంటే మధుమేహం ముప్పు వెంటాడుతుంది. నిద్ర సరిపడినంత లేకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.


జ్ఞాపకశక్తి తగ్గడం


రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరమంటారు ఆరోగ్య నిపుణులు. రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంపై , మస్తిష్కంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోలేరు. అందుకే రోజుకు కావల్సినంత నిద్ర ఉండేట్టు చూడటం చాలా అవసరం.


రోగ నిరోధక శక్తి బలహీనమవడం


రోగ నిరోధక శక్తి అనేది మనిషి శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది. అందుకే ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. కేవలం వివిధ రకాల పోషకాలే కాకుండా తగినంత నిద్ర లేకపోయినా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఫలితంగా రోగాల్ని ఎదుర్కోవడంలో శరీరం సామర్ధ్యం కోల్పోతుంది.


మూడ్ మారడం


రోజూ తగిన మోతాదులో అంటే 7-8 గంటల నిద్ర లేకుంటే క్రమక్రమంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కన్పిస్తుంది. నిద్రలేమితో రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే కచ్చితంగా దాని ప్రభావం మస్తిష్కంపై పడుతుంది. ఫలితంగా మూడ్ స్వింగ్ అవుతుంటుంది. ఈ క్రమంలో డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటివి ఎదురౌతాయి.


Also read: Hair Care Tips: మీ కేశాలు అందంగా, ఆరోగ్యంగా నిగనిగలాడాలంటే..ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook