Hair Care Tips: మీ కేశాలు అందంగా, ఆరోగ్యంగా నిగనిగలాడాలంటే..ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి

Hair Care Tips: అందమైన కేశాలంటే మగువలకు మక్కువ ఎక్కువ. అందుకే కేశ సంరక్షణకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో జీవనశైలి కారణంగా కేశాల సమస్యలు కూడా ఎదుర్కొంటుంటారు. వివిధ రకాల కేశ సమస్యలకు ఒకటే అద్భుత పరిష్కారం మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2023, 06:19 PM IST
Hair Care Tips: మీ కేశాలు అందంగా, ఆరోగ్యంగా నిగనిగలాడాలంటే..ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి

Hair Care Tips: ఆధునిక బిజీ ప్రపంచం, ఉరుకులు పరుగుల జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, పని వేళలు ఇవన్నీ వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంటాయి. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే కేశాల సమస్యలకు ఇవే కారణాలు. జుట్టు రాలడం, హెయిర్ గ్రోత్ సరిగ్గా లేకపోవడం, జుట్టు నిగారింపు కోల్పోవడం అన్నీ తరచూ వెంటాడే సమస్యలే.

కేశాల ఎదుగుదల బాగుండాలని, నిగనిగలాడాలని, హెయిర్ ఫాల్ ఉండకూడదని ప్రతి ఒక్క మహిళకూ ఉంటుంది. ప్రతి మహిళ తమ కేశాలు అందంగా, ధృఢంగా, పొడుగ్గా ఉండాలని కోరుకుంటుంది. దీనికోసం అద్భుతంగా పనిచేసే నేచురల్ హోమ్ రెమిడీ ఇది. ఆనపకాయ హెయిర్ మాస్క్ ఇది. ఇందులో పుష్కలంగా ఉంటే విటమిన్ బి వంటి పోషకాలతో మీ కేశాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కేశ సంబంధిత సమస్యలన్నీ దూరమౌతాయి. ఆనపకాయ అనేది నిత్యం కూరల్లో కన్పించే వంట. ఆరోగ్యపరంగా చాలా మంచిది. అదే సమయంలో కేశాలకు కూడా చాలా ప్రయోజనమని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు. ఆనపకాయ హెయిర్ ప్యాక్‌తో కేశాలు ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా నిర్జీవంగా ఉండే కేశాలు సైతం నిగనిగలాడుతాయి. 

ఆనపకాయ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి

ఆనపకాయ హెయిర్ మాస్క్ తయారీకు ఒక కప్పు ఆనపకాయ రసం, 4 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ ఆపిల్ సైడర్ కావల్సి ఉంటాయి. ఆనపకాయ హెయిర్ మాస్క్ తయారీకు ముందుగా ఆనపకాయను ఒలిచి మిక్సీలో పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఆ తరువాత 4 స్పూన్ల పెరుగు మిక్స్ చేయాలి. చివర్లో అన్నింటినీ బాగా కలుపుకోవాలి. 

ఆనపకాయ హెయిర్ మాస్క్ రాయడానికి ఒకరోజు ముందు తలస్నానం చేయాలి. ఆ తరువాత ఆనపకాయ హెయిర్ మాస్క్‌ను జుట్టు కుదుళ్లు, స్కాల్ప్‌కు బాగా పట్టేలా రాయాలి. ఈ మిశ్రమాన్ని దాదాపు 30-40 నిమిషాలు అలానే ఉంచి..సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తిరిగి ఒక రోజు వరకూ తలస్నానం చేయకూడదు. అంటే ఒకరోజు ముందు, ఒకరోజు తరువాతే తలస్నానం చేయాల్సి ఉంటుంది.

Also read: Health Tips: నీళ్లలో లభించే ఈ మొక్కతో.. హార్ట్ ఎటాక్, కేన్సర్ నుంచి రక్షణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News