Vitamin B12 Foods: శరీరం ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్ఠికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం శరీరానికి కావల్సిన విటమిన్లు, న్యూట్రియంట్లు మనం తీసుకునే పౌష్టికాహారంలోనే ఉంటాయి. అందుకే విటమిన్ల లోపం లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరానికి వివిధ రకాల విటమిన్ల అవసరం ఎలా ఉందో విటమిన్ బి12 అవసరం అలాంటిది. ఇది శరీర నిర్మాణంలో చాలా కీలకమైందిగా పరిగణిస్తారు. విటమిన్ బి12 లోపిస్తే చాలా సమస్యలు వెంటాడుతాయి. ఓ ఆరోగ్యకరమైన మనిషికి రోజుకు దాదాపు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరమౌతుంది. మనం తీసుకునే వివిధ రకాల ఆహార పదార్ధాల ద్వారా విటమిన్ బి12 కావల్సినంత లభించకపోతే నీరసం, అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం, వాంతులు, డయేరియా, వెయిట్ లాస్, కాళ్లు-చేతులు తిమ్మిరెక్కడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఫలితంగా శరీరం బలహీనమైపోతుంది. శరీరానికి ఇంత అవసరమైన విటమిన్ బి12 లోపాన్ని సరిచేసేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..


విటమిన్ బి12 సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు


విటమిన్ బి12 ఎక్కువగా మాంసం, చేపల్లో ఉంటుంది. సాల్మన్ రకం చేపలో కావల్సినంత మోతాదులో విటమిన్ బి12 లభిస్తుంది. ఈ చేప ఫ్రెష్, సాల్ట్ రెండు రకాల నీళ్లలో ఉంటుంది. ఇందులో విటమిన్ బి12తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా దొరుకుతాయి.


ట్యూనా ఫిష్ అనేది అత్యుత్తమ ఆహార పదార్ధం. ఇదొక సముద్ర చేప. ఇందులో మీకు కావల్సిన పరిమాణంలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఉంటాయి. దాంతో పాటు శరీరానికి కావల్సిన విటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటుంది. అయిదే ఇది చాలా ఖరీదైన చేప. జపాన్ దేశంలో ఎక్కువగా లభిస్తుంది.


విటమిన్ బి12 లోపం సరిచేసేందుకు మరో ముఖ్యమైన ఆహారం గుడ్లు. చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో గుడ్లను తీసుకుంటారు. ఇందులో ప్రోటీన్లు, నేచురల్ ఫ్యాట్ తోపాటు విటమిన్ బి12 కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. గుడ్లలోని తెలుపు కంటే పసుపు ఎక్కువగా తింటే విటమిన్ బి12 ఎక్కువగా అందుతుంది.  


విటమిన్ బి12 పాల ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా లభిస్తుంది. దీనికోసం రోజూ డైట్‌లో పాలతో పాటు పన్నీరు, పెరుగు వంటివి చేర్చాల్సి ఉంటుంది. పాల ఉత్పత్తులకు దేశంలో ఎలాంటి కొదవ లేదు. 


విటమిన్ బి12 పెద్దమొత్తంలో కావల్సినంత పరిమాణంలో లభించేది మాంసంలోనే. మాంసంలో పెద్దఎత్తున ప్రోటీన్లు, ఫ్యాట్ ఉంటాయి. శరీర ఎదుగుదల, వృద్ధికి చాలా అవసరం. మాంసంలో విటమిన్ బి12 అధికంగా ఉన్నందున డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. వారానికి 2-3 సార్లు కనీసం ఉండాలి.


Also read: Cholesterol Foods: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాంతకమే, ఈ ఫుడ్స్ వెంటనే దూరం చేయాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook