Vitamin B12: శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ బి12 అత్యంత కీలకమైంది. శరీరంలో కొన్ని అవయవాల పనితీరులో విటమిన్ బి12 చాలా అవసరమౌతుంది. అయితే కొంతమందిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ బి12 తో కలిగే దుష్పరిణామాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ బి12 అతిగా తీసుకుంటే కలిగి దుష్పరిణామల్లో ముఖ్యమైంది డయేరియా. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్ట్రబెన్స్. విటమిన్ బి12 అతిగా తీసుకుంటే ఈ సమస్య ఎదురుకావచ్చు. జీర్ణ సంబంధ సమస్యలున్నవారిలో ఈ పరిస్థితి ఉత్పన్నమౌతుంది. 


ఇక రెండవ సైడ్‌ఎఫెక్ట్ స్కిన్ రియాక్షన్. విటమన్ బి12 అతిగా తీసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు ఉత్పన్నం కావచ్చు. కొంతమందిలో దురద, ర్యాషెస్ వంటివి కన్పించవచ్చు. అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. అందుకే ఈ లక్షణాలేమైనా కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


డిజినెస్ మరో ప్రధాన దుష్పరిణామం. విటమిన్ బి12 ఎక్కువ డోసు తీసుకుంటే ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. మోతాదుకు మించి డోసు తీసుకుంటే ఈ పరిస్థితి రావచ్చు. అంటే విటమిన్ బి12 పరిమితి మించితే శరీరం ప్రతీకూలంగా స్పందిస్తుంది. విటమిన్ బి12 తీసుకుంటున్నవారిలో ఎవరికైనా ఈ లక్షణం కన్పిస్తే వైద్యుడిని సంప్రదించాలి. 


ఎలర్జీ సమస్యలు కూడా ఉంటాయి. విటమిన్ బి12 ఎక్కువైతే దురద, స్వెల్లింగ్, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈ లక్షణాలు కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 


విటమిన్ బి12 శరీరానికి మంచిదే అయినా ఓవర్ డోస్ అనేది ఉండకూడదు. మోతాదుకు మించి అంటే వైద్యుడు సూచించిన పరిమాణం కంటే ఎక్కువ విటమిన్ బి12 తీసుకోవడం వల్ల శరీరంలో ప్రతికూల ప్రభావం కన్పిస్తుంది. అందుకే ఎప్పుడూ సాధ్యమైనంతవరకూ వైద్యుని సలహా మేరకే విటమిన్ బి 12 ఎంతమొత్తంలో తీసుకోవాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది.


Also read: Benefits Of Nutmeg: జాజికాయ పొడిలో బోలెడు ఔషధ గుణాలు..రోజు ఇలా చేస్తే ఊహించని లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook