జీవనశైలి, ఆహారపు అలవాట్లు బాగుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీవనశైలిని అందుకు తగ్గట్టుగా మార్చుకోవల్సి వస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలను దూరంగా పెట్టడం, కొన్నింటిని డైలీ డైట్‌లో చేర్చడం అవసరం. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజురోజూకూ ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. గతంలో ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు ఇష్టంగా తినేవారు. ఇప్పుడు ఆ స్థానంలో జంక్ ఫుడ్స్ వచ్చి చేరాయి. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోంది. వివిధ రకాల వ్యాధులు ఎటాక్ చేస్తుంటాయి. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ సమస్య ఉత్పన్నమౌతుంది. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే చేరుతుందో..గుండెపోటు ముప్పు పెరుగుతుంది. గుండెపోటు ముప్పు తగ్గాలంటే ముందు కొలెస్ట్రాల్ సమస్యను అరికట్టాలి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కొన్ని రకాల కూరగాయల్ని డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది.


కొలెస్ట్రాల్ దూరం చేసే కూరగాయలు


పాలకూర


రోజువారీ డైట్‌లో పాలకూరను తప్పకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే పాలకూర విటమిన్ సి అధికంగా ఉండే సీజనల్ కూర. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బందిపడేవాళ్లు పాలకూరను డైట్‌లో చేర్చుకుంటే..చాలా త్వరగా ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే పాలకూర ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. 


బ్రోకలీ


బ్రోకలీ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ. ఇందులో విటమిన్ సి, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్..శరీరంలో కొలెస్ట్రాల్‌ను తొలగించేందుకు దోహదం చేస్తుంది. 


బీట్‌రూట్


బీట్‌రూట్‌లో కరిగే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. మరోవైపు నైట్రేట్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త వాహికల్ని వెడల్పు చేయడంలో దోహదం చేస్తుంది. రక్త నాళికల్లో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.


Also read: Heart Attack: గుండెపోటు సోమవారం నాడే ఎందుకు ఎక్కువగా వస్తుంటుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook