Heart Attack: గుండెపోటు సోమవారం నాడే ఎందుకు ఎక్కువగా వస్తుంటుంది

Heart Attack: గుండెపోటు. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతోంది. గుండెపోటుతో ప్రాణాలు దక్కించుకున్నవారి సంఖ్య తక్కువే. గుండెపోటు ప్రమాదం పెరగడానికి కారణాల గురించి పరిశీలిస్తే ఆసక్తికర అంశం వెల్లడైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2023, 07:39 AM IST
Heart Attack: గుండెపోటు సోమవారం నాడే ఎందుకు ఎక్కువగా వస్తుంటుంది

జీవనశైలి సరిగా లేకపోవడం, జన్యు సంబంధిత సమస్యలు గుండెపోటుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అందుకే గుండెపోటు అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వెన్నాడుతోంది. అయితే గుండెపోటుకు ప్రత్యేకించిన ఏదైనా వారానికి సంబంధం ఉందా అనే విచిత్రమైన ప్రశ్న వస్తుందిప్పుడు..

అసలు వారానికి , గుండెపోటుకు సంబంధమేంటని ఆశ్చర్యపోవద్దు. ఇదేదీ సాధారణంగా చెబుతుంది కాదు. పరిశోధకులు అధ్యయనంతో చెబుతున్నమాటలు. సాధారణంగా పరిశోధకులు సోమవారమే గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదముందంటున్నారు. 

గుండెపోటు లక్షణాలు

ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది మంది హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోతున్నారు. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రవాహానికి ఏదైనా అడ్డుపడినప్పుడు గుండెకు ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో గుండెపోటు సంభవిస్తుంటుంది. గుండెపోటు సంభవించినప్పుడు ఛాతీలో అసౌకర్యం, ఛాతీలో నొప్పి, చేతుల నొప్పి, అజీర్తి, జీర్ణాశయంలో అసౌకర్యం, చెమటలు పట్టడం, వాంతులు, ఆందోళన, అలసట, గుండె చప్పుడు వేగంగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగని అందరిలో ఇవే లక్షణాలుండవు.

సోమవారమే ఎక్కువగా గుండెపోట్లు

వారంలో ఒక్కరోజులోనే ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు పరిశోధకులు. అది సోమవారం నాడు. ఇదేదో వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా నిజమే కావచ్చు. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ల కాలంలో 1 లక్షా 56 వేల ఆసుపత్రుల్లో నమోదైన హార్ట్ ఎటాక్ కేసుల వివరాలు సేకరించి విశ్లేషించిన అధ్యయనం ఇది. ఈ అధ్యయం ప్రకారం ఎక్కువగా గుండెపోటు అనేది సోమవారం నాడే రావచ్చని తెలుస్తోంది. 

కారణాలేంటి

శని, ఆదివారాల్ని సహజంగా వీకెండ్ డేస్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. వీకెండ్స్‌లో ఆలస్యంగా నిద్రపోతారు. సోమవారం ఉదయం తొందరగా లేవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా శరీరంలోని అంతర్గత వ్యవస్థ సర్కేడియన్ రిథమ్ దెబ్బ తిని హార్ట్ ఎటాక్ సంభవించవచ్చని పరిశోధకులు తేల్చారు. అయితే కేవలం సోమవారం నాడే వస్తుందని కాదు గానీ..సోమవారం నాడు ఎక్కువగా వస్తుంటుంది. అందుకే పరిమితంగా వ్యాయామం, సరైన పౌష్ఠికాహారం, వేళకు నిద్ర ఉంటే హార్ట్ ఎటాక్ రిస్క్ తక్కువగా ఉంటుంది. 

Also read; Hair Loss Issue: జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News