Black Coffee: టీ కంటే బ్లాక్ టీ ఎలా ఆరోగ్యానికి మంచిదో కాఫీ కంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి అంత మంచిది. అదిక బరువు సమస్యతో బాధపడేవారికి బ్లాక్ కాఫీ ఓ ఔషధంలా పనిచేస్తుంది. స్థూలకాయానికి చెక్ పెట్టడమే కాకుండా గుండె జబ్బులు సైతం బ్లాక్ కాఫీతో దూరమౌతాయనేది తాజా అధ్యయనాలు చెబుతున్న మాట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బ్లాక్ కాఫీతో డయాబెటిస్, స్థూలకాయం, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. ఎందుకంటే బ్లాక్‌కాఫీలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువ. అలాగే శరీరాన్ని విష వ్యర్థాల నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాఫీలో ఉండే కెమికల్ కాంపౌండ్లు చాలా శక్తిమంతమైనవి. వివిధ రకాల వ్యాధులు సోకకుండా నియంత్రిస్తాయి. ప్రాణాంతకమైన కాన్సర్ వ్యాధి సోకకుండా కూడా కాఫీ అడ్డుకోగలదని నిపుణులు చెబుతున్నారు.


బ్లాక్ కాఫీతో అధిక బరువుకు చెక్


గ్రీన్‌ కాఫీ గింజలు మన శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. ఇది కాలేయానికి సహజసిద్ధమైన క్లీన్సర్‌గా కూడా పని చేస్తుంది. కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి జీవక్రియ సమర్ధవంతంగా ఉండేలా చేస్తుంది.


అమెరికా అధ్యయనం ప్రకారం..కప్పు బ్లాక్‌కాఫీలో 2 కేలరీలు ఉంటాయి. అంటే కాఫీలో కేలరీలు తక్కువే. అయితే.. కాఫీకి అదనంగా బెల్లం, పంచదార, పాలు, వెనీలా, సోయా మిల్క్, చాకొలెట్ సిరప్ వంటివి జత చేయకుండా తాగితే మంచిది. బ్లాక్‌‌కాఫీలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనే పదార్థం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ కారణంగా రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్‌ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.


కెఫీన్ మంచిదా కాదా


బ్లాక్‌కాఫీలో ఉండే కెఫిన్‌ మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది మంచిదా కాదా అనే విషయంలో చాలా సందేహాలున్నాయి. అయితే కెఫిన్‌ అనే పదార్థం వాస్తవానికి మెదడును, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా పని చేసేందుకు సహాయపడుతుంది. శక్తి సామర్ధ్యాలను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. శరీరంలో నీరు ఎక్కువైనప్పుడు బరువు పెరగడం, పొట్ట పెరగడం సాధారణం. బ్లాక్‌కాఫీ తాగడం వల్ల శరీరంలో అవసరం లేని నీటిని బయటకు పంపేస్తుంది. తరచూ యూరిన్‌కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. అందుకే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగితే కెఫీన్ దుష్పరిణామాలకు దారి తీయవచ్చంటున్నారు. అందుకే పరమితి దాటకూడదు.


Also read: Foxtail Millet Benefits: కొర్రలతో తయారుచేసిన పాయసంతో శరీరానికి ఇన్ని లాభాలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook