Health Tips: ఒంట్లో అధిక వేడి తగ్గించే చిట్కాలు
మనం తీసుకునే ఆహారం, ఇతర ఆహారపు ఆహారపు అలవాట్లతో శరీరంలో అధిక వేడిని తగ్గించవచ్చు. శరీరంలో అధిక వేడి కారణంగా తలనొప్పి, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వేడిని తగ్గించేందు (How to Reduce Body Heat) కు కొన్ని చిట్కాలు మీకోసం
తరుచుగా మనం తీసుకునే ఆహారం, ఇతర ఆహారపు ఆహారపు అలవాట్లతో శరీరంలో అధిక వేడిని తగ్గించవచ్చు. మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. శరీరంలో అధిక వేడి కారణంగా తలనొప్పి, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వేడిని తగ్గించేందు (How to Reduce Body Heat) కు కొన్ని చిట్కాలు మీకోసం. Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది
వేడిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు (Tips to Reduce Body Heat)
- శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో వేడి (శరీర ఉష్ణోగ్రత) పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు, ఏదైనా ద్రావణాలను తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది.
- ఒక స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. అధిక వేడి నుంచి మీకు ఉపశనమనం లభిస్తుంది.
- స్విమ్మింగ్ (ఈత కొట్టడం) వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త మేర తగ్గుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
- మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్‌ను రాస్తే ఒక్కసారిగా ఉపశమనం లభిస్తుంది.
- గాలి బాగా ఉన్న చోటనే కూర్చోవాలి. తగినంత ఆక్సిజన్ అందే పరిస్థితి లేకపోతే శరీరంలో మార్పులు చోటుచేసుకుని బాడీ టెంపరేచర్ పెరగినట్లు అనిపిస్తుంది. ఫ్యాన్ కింద, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చోవాలి.
- థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే శరీరంలో అధిక వేడి పుడుతుందని తెలిసిందే. కొన్ని సందర్భాలలో దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, అధిక చెమట, జాండీస్ వస్తుంటాయి. డాక్టర్‌ను సంప్రదించి వారి సలహాలు పాటించాలి. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు
Sanitizer: పదే పదే శానిటైజర్ వాడొద్దు.. ఎందుకో తెలుసా?