Health Tips in Telugu: ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లేనని నిపుణులు చెబుతున్నారు. సొంత అలవాట్లను నియంత్రించుకోలేకపోవడంతో శరీరానికి హాని కలుగుతుందని అంటున్నారు. మధ్య వయస్సు వచ్చేసరికి కిడ్నీ సంబంధింత వ్యాధికి గురికాకుండా ఉండాలంటే.. చిన్న వయసు నుంచే కొన్ని ఆహారపు అలావాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏయే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

==> ఆధికంగా ఉప్పు వినియోగం: ఆహారంలో ఉప్పు వినియోగం ఎక్కువగా ఉండకూడదు. అధిక ఉప్పు వినియోగం అధిక రక్తపోటుకు కారణమవుతుంది. దీంతో మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశం ఉంటుంది.


==> అధిక ప్రోటీన్ తీసుకోవడం: ప్రోటీన్ మన శరీరానికి ఎంతో ముఖ్యం. కానీ అధిక ప్రోటీన్ తీసుకోవడం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు. యువత మాంసాహారం వంటి అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారాన్ని లిమిట్‌లో తీసుకోవాలని సూచిస్తున్నారు.


==> అతిగా టీ, కాఫీ తాగడం: టీ, కాఫీ, ఇతర కెఫిన్ కలిగిన పానీయాల అధిక వినియోగం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులో, ప్రజలు అలసటను నివారించడానికి ఇలా చేస్తారు, ఇది దీర్ఘకాలికంగా ప్రమాదకరంగా ఉంటుంది.


==> వేయించిన ఆహారాన్ని తినడం: ఎక్కువ నూనె, వేయించిన ఆహారం తింటే అధిక బరువుకు కారణం అవుతుంది. ఇది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. చైనీస్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ లేదా చికెన్ ఫ్రైస్ వంటి వాటిని తినే అలవాటు ఉంటే మానుకోండి. 


==> మద్యం సేవించడం: మద్యపానం అలవాటు అన్నింటికి ప్రమాదమే. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది. మద్యం ఎక్కువగా తీసుకునే వారి కిడ్నీలు త్వరగా పాడవుతాయి. మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే.. మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు.


(గమనిక: ఈ వార్త మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. Zee News Telugu ధృవీకరించలేదు. మీరు ఇక్కడి విషయాలను స్వీకరించే ముందు కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి..) 


Also Read: Vande Bharat Express: ఒక్క రోజులో బెంగుళూరుకు వెళ్లి రావొచ్చు.. 'వందే భారత్' ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి      


Also Read: Snake Bite: ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటు వేసిన పాము.. ఇద్దరు మృతి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి