Cholesterol Myths And Facts: కొలెస్ట్రాల్.. కొలెస్ట్రాల్.. కొలెస్ట్రాల్.. ప్రస్తుత లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ కారణంగా చాలామందిని వేధిస్తోన్న సమస్యే ఈ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఏ ఇబ్బందీ లేదు కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికమైతేనే అన్ని సమస్యలు షురూ అవుతాయి. ఇంతకీ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని ఎలా అదుపులో పెట్టుకోవాలో.. ఏం చేయాలో, ఏం చేయకూడదో బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అపోహ: నాకు నా శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసుకునేందుకు నాకు మెడిసిన్స్ అవసరం లేదు. సరైన ఆహారం, వ్యాయమంతోనే కొలెస్ట్రాల్‌ని మేనేజ్ చేసుకుంటాను అనేది ఒక అపోహ మాత్రమే. 


నిజం: కేవలం చక్కటి ఆహారం, వ్యాయమంతో మాత్రమే కొలెస్ట్రాల్‌ని కంట్రోలే చేయడం అనేది అందరి విషయంలో సాధ్యపడకపోవచ్చు. ఒక్కొక్కరి శరీరం ఒక్కో రకంగా ఉంటుందన్నట్టుగా కేవలం ఆహారానికి, వ్యాయమానికి శరీరం స్పందించే తీరు కూడా అంతే వేరుగా ఉంటుంది. కొంతమందికి మెడిసిన్స్‌తోనే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.


అపోహ: నా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుందంటే అది నాకు తెలిసిపోతుంది. అది నేను ఫీల్ అవ్వగలను అనుకోవడం ఒక అపోహ మాత్రమే.


నిజం: శరీరంలో హై కొలెస్ట్రాల్‌కి ఎలాంటి హెచ్చరికలు, సంకేతాలు ఉండవు. అందుకే చాలామంది విషయంలో గుండెపోటు అనేది ఎప్పుడొస్తుందో కూడా తెలియకుండానే వస్తుంది.


అపోహ: నాలో కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ చేయడం కోసం నేను ఏమీ చేయలేను అనుకునేది ఒక అపోహ మాత్రమే.


నిజం: ఏ ప్రయత్నం చేయకుండానే కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయలేమని చేతులెత్తేస్తే లాభం ఉండదు. ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి. నియమాలతో కూడిన ఆహారం, వ్యాయమంతో కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయలేం అని వదిలేస్తే అది అనారోగ్యానికి దారితీస్తుంది.


అపోహ: కొలెస్ట్రాల్ అంటేనే శరీరానికి హానీ అని అనుకోవడం అపోహ మాత్రమే. కేవలం బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే ఒంటికి హాని చేస్తుందని తెలుసుకోవాలి.


నిజం: కొన్నిరకాల కొలెస్ట్రాల్ ఒంటికి అవసరం కూడా. మరీ ముఖ్యంగా గుడ్ కొలెస్ట్రాల్ ఒంటికి మేలు చేస్తుంది.


అపోహ: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు అని అనుకోవడం ఒక అపోహ.


నిజం: కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఫుడ్స్‌ని దూరం పెట్టాలి. ముఖ్యంగా సాట్యురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి.


ఇది కూడా చదవండి : BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?


ఇది కూడా చదవండి : Amul Franchise Investment: అమూల్ ఫ్రాంఛైజీతో భారీ లాభాలు.. 2 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 5 లక్షల వరకు లాభం


ఇది కూడా చదవండి : Flipkart vs Customer: ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ రాలేదు కానీ డబ్బులు కట్ అయ్యాయి.. కస్టమర్ కేర్ రెస్పాన్స్ లేదు.. చివరకు ఏం జరిగిందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook