BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?

BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Written by - Pavan | Last Updated : Dec 21, 2022, 10:20 PM IST
  • ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
  • బిఎఫ్.7 వేరియంట్ 1 మిలియన్ మందిని బలిగొంటుందా ?
  • 3 నెలల్లో 60 శాతం మందికి ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్
  • ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ సంక్రమణ కూడా ఎక్కువే
BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?

BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ అంటే ఏంటి ?
ప్రస్తుతం చైనాలో కరోనావైరస్ కేసులు భారీగా పెరగడానికి కారణం ఈ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్. చైనాలో పెరుగుతున్న కరోనా తీవ్రత చూసి యావత్ ప్రపంచం షాక్ అవుతోంది. 2019 లో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి అనేక వేరియంట్స్‌గా రూపాంతరం చెందుతూ వస్తోంది. అలా వచ్చిన అన్ని వేరియంట్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక కాలం పాటు.. అంటే ఏడాదికిపైగా వ్యాప్తిలో ఉంది. ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎంత త్వరగా సంక్రమిస్తుందో.. అంతే త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

1 మిలియన్ మందిని బలిగొంటుందా ?
రాబోయే కొన్ని నెలల్లో సుమారు 10 లక్షల మంది కరోనావైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం 85 శాతం మందికి నాలుగో డోస్ వ్యాక్సిన్ పూర్తవుతుందని.. ఫలితంగా కరోనావైరస్ వ్యాప్తి కూడా నెమ్మదిస్తుందని తెలుస్తోంది.

3 నెలల్లో 60 శాతం మందికి ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్
చైనాలో రాబోయే 3 నెలల్లో 60 శాతం మందికి ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ సోకుతుంది అని చైనాకు చెందిన ఎరిక్ ఫీగ్-డింగ్ అనే ఎపిడెమియాలజిస్ట్ చేసిన ట్వీట్ చైనీయులను భయపెడుతోంది. కొన్ని మిలియన్ల మంది కొవిడ్ కారణంగా చనిపోతారని ఎరిక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎరిక్ చెప్పిన జోస్యం చైనా పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం ప్రపంచ జనాభాలో 10 శాతం మందికైనా కొవిడ్ సోకుతుందంటున్నాడు ఎరిక్. అలాగే మృతుల సంఖ్య కూడా మిలియన్లలో ఉంటుందని హెచ్చరిస్తున్నాడు. 

సంక్రమణ కూడా ఎక్కువే
ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ సంక్రమించే వేగం కూడా ఎక్కువే. ఈ వేరియంట్ ఒక్కరికి సోకితే.. వారి నుంచి 10 మంది నుంచి 18 మంది వరకు సోకే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. లక్షణాలు లేకుండా బిఎఫ్.7 వేరియంట్ సోకితే అది మరింత ప్రమాదకరం కానుంది. ఎందుకంటే వారికి తెలియకుండానే వారు ఇంకొంతమందికి బిఎఫ్.7 వేరియంట్‌ను అంటించే ప్రమాదం ఉంటుంది అని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి : BF.7 Variant Cases in India: వామ్మో.. చైనాను హడలెత్తిస్తున్న వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది

ఇది కూడా చదవండి : Kidney stones: మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే..నిర్లక్ష్యం చేయవద్దు, ప్రమాదకరమే

ఇది కూడా చదవండి : Blood pressure: అధిక రక్తపోటును నియంత్రించే అద్భుతమైన చిట్కాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News