Diabetic control: ఆహారంలో ఈ చిన్న మార్పులు.. షుగర్ నివారణకి పెద్ద ఫలితం
Tips for Diabetics: చాలా వరకు పేషెంట్స్ లో.. డయాబెటిస్.. ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తుంది. ఇక మధుమేహం వచ్చినవారు.. కేవలం తీపి పదార్థాలు మాత్రమే తినకూడదు అని.. అనుకుంటూ ఉంటారు. కానీ మిగతా ఆహారాల విషయంలో దృష్టి పెట్టరు. అలా కాకుండా మధుమేహంతో.. బాధపడుతున్న వారు కచ్చితంగా ఈ ఆరు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
Diabetes Control Tips: వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు చాలామంది ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే అది కేవలం జన్యుపరంగా వచ్చే వ్యాధి మాత్రమే కాదు. మన ఆహారపు అలవాట్ల..కారణంగా కూడా ఇప్పుడు డయాబెటిస్ చాలామందిలో కనిపిస్తుంది. అయితే డయాబెటిస్..వచ్చిన వారు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సరైన ఆహారపు అలవాట్లతో, పౌష్టిక ఆహారంతో, షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.
కచ్చితంగా రోజు మెడిసిన్ తీసుకోవడంతో పాటు, వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చాలా ముఖ్యం. ఎక్కువ పీచు పదార్థం, ప్రోటీన్ ఉంది ఆహారం తీసుకోవడం మంచిది. షుగర్ పేషెంట్స్ కచ్చితంగా పాటించాల్సిన కొన్ని ఆరోగ్య నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
కార్బెహైడ్రేట్స్ కి దూరంగా..
డయాబెటిస్ ఉన్నవాళ్లు.. తమ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం.. తీసుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయి.. చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే కార్బోహైడ్రేట్స్.. ఉండే ఆహార పదార్థాలు కాకుండా, చిక్కుడుకాయలు, తాజా కూరగాయలు, తృణ ధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల చక్కర స్థాయి నియంత్రణలోకి వస్తుంది.
పీచు పదార్థం.. ఎక్కువగా ఉండే ఆహారం:
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. డయాబెటిస్ పేషెంట్స్ కి చాలా అవసరం. రక్తంలోని చక్కర స్థాయిని స్థిరీకరించడానికి, జీర్ణవ్యవస్థ పనితనాన్ని మెరుగుపరచడానికి.. పీచు పదార్థం ఎక్కువగా ఉపయోగపడుతుంది. పీచు పదార్థం ..ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల.. చిరుతిళ్ళు తినాలి అన్న కోరిక కూడా నియంత్రణలోకి వస్తుంది.
ప్రొటీన్:
పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, చేపలు, పనీర్.. ఇలా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి.. ఎక్కువగా వేయకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో.. ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగడం వంటివి జరగవు.
హెల్తీ ఫ్యాట్:
డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలు, అవకాడోలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆహార పదార్థాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని ఆరోగ్యకరమైన కొవ్వులు.. అని కూడా అంటాం. ఈ హెల్తీ ఫ్యాట్ మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గుండె జబ్బుల.. ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సరైన సమయంలో సరైన ఆహారం:
రోజు సమయానికి ఆహారం తినడం చాలా ముఖ్యం. తినడం లేట్ అయ్యే కొద్ది.. రక్తంలో చక్కెర స్థాయి కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని.. స్థిరంగా ఉంచడానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అలాగే సమయానికి మంచి ఆహారం తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు శరీరానికి కావాల్సిన శారీరక శ్రమ కూడా ఉండాలి. దానికోసం యోగ, ఏరోబిక్స్ వంటివి మన జీవన శైలిలో.. చేర్చుకుంటే డయాబెటిస్ తో పాటు ఊబకాయం వంటివి కూడా రాకుండా ఉంటాయి.
Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..
Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter