Healthy Foods: మనిషి శరీరం పనితీరు సరిగ్గా ఉండాలంటే లివర్ ఆరోగ్యంగా ఉండాలి. లివర్ పనితీరులో ఏ సమస్య తలెత్తినా క్రమక్రమంగా అన్ని అంగాలపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్తీ ఫుడ్స్ తప్పకుండా తినాలి. మరీ ముఖ్యంగా లివర్ డీటాక్స్ అనేది చాలా ముఖ్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో కొన్ని అంగాలు ఎప్పుడూ కీలకమే. కిడ్నీ, లివర్, గుండె, మెదడు చాలా ప్రభావం చూపించే అంగాలు. ఇవాళ మనం లివర్ ఎంత ముఖ్యమైందో తెలుసుకుందాం. శరీరంలో న్యూట్రిషన్లను స్టోర్ చేసేది లివర్ మాత్రమే. అంతేకాదు శరీరాన్ని డీటాక్స్ చేయడం, మెటబోలిజం సరిగ్గా  ఉండేట్టు చూడటం లివర్ ముఖ్య విధులు. అందుకే లివర్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే లివర్ పనితీరులో ఆటంకం ఏర్పడుతుంది. చెడు ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమౌతాయి. మనం తినే ఆహారంలో లోపముంటే అది కాస్తా లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 


లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..లివర్ పనితీరు సక్రమంగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ డైట్‌లో తప్పకుండా ఉండాలి. ఫలితంగా శరీరం పనితీరు మెరుగుపడుతుంది. ఈ హెల్తీ ఫుడ్స్ డైట్‌లో భాగం చేసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఉండదు. ఇటీవలి కాలంలో నూటికి 60-70 మందిలో ఫ్యాటీ లివర్ సమస్య ఉంటోందంటే ఆతిశయోక్తి కాదు. అదే సమయంలో చెడు లైఫ్‌స్టైల్ కూడా మార్చాల్సి ఉంటుంది. 


వెల్లుల్లి ఉపయోగాలు


లివర్‌ను యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంచేందుకు పచ్చి వెల్లుల్లి రెమ్మలు రోజూ ఉదయం పరగడుపున తినాలి. ఈ రెమ్మలు ఆరోగ్యానికి చాలా మంచిది.  వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ లివర్ ఎంజైమ్‌కు చాలా మంచివి. దీంతో లివర్‌లోని విష పదార్ధాలు బయటకు పంపించేయవచ్చు.


బ్రోకోలీ లాభాలు


బ్రోకోలీ అనేది డైట్‌లో ఉంటే శరీరంలోని వ్యర్ధ లేదా విష పదార్ధాలు బయటకు తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. బ్రోకోలీ కూరలో ఉండే గ్లూకోసైనోలేట్స్‌తో శరీరంలో ఉండే హానికారకమైన కాంపోనెంట్స్ తొలగించవచ్చు. ఇది కాకుండా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతుంది. 


నట్స్ అండ్ సీడ్స్


లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు రోజూ తినే ఆహారంలో నట్స్, సీడ్స్ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. బాదం, వాల్‌నట్స్, రాజ్మా, బీన్స్, ఫ్లక్స్ సీడ్స్ లాంటివి తప్పకుండా తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఇ తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల లివర్ సదా ఆరోగ్యంగా ఉంటుంది.


Also read: Coriander Benefits: ధనియాలు వంటల్లోనే కాదు..ఇలా వాడి చూడండి, లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook