చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల సీజనల్ వ్యాధులు ఎదురౌతుంటాయి. వీటి నుంచి రక్షించుకుకోవాలంటే హెర్బల్ టీ సరైన ప్రత్యామ్నాయం. హెర్బల్ టీ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదే సమయంలో మెటబోలిజం వేగవంతమౌతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ చలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత ఢిల్లీలో పెరిగిపోతోంది. ఈ ప్రాణాంతక చలి నుంచి రక్షించుకునేందుకు వివిధ రకాల పద్ధతులున్నాయి. కొంతమంది చలిమంట కాచుకుంటే..మరికొందరు హీటర్ అమర్చుకుంటారు. చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే వివిధ రకాల పదార్ధాలు తీసుకుంటారు. ఫలితంగా వ్యాధుల ముప్పు దూరమౌతుంది. 


హెర్బల్ టీ వినియోగం


1. ఆరోగ్య నిపుణుల ప్రకారం..ఎముకలు కొరికే చలి నుంచి హెర్బల్ టీ కాపాడుతుంది. ఇది శరీరం ఇమ్యూనిటీని పెంచుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాదులు దూరమౌతాయి. హెర్బల్ టీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హెర్బల్ టీ శరీరానికి లోపల్నించి వేడి అందిస్తుంది. హెర్బల్ టీ తయారు చేసేందుకు మీ కిచెన్‌లో లభించే కొన్ని పదార్ధాలు చాలు. 


2. హెర్బల్ టీ కాకుండా రోగ నిరోధక శక్తి పెంచేందుకు నెయ్యి కూడా ఉపయోగపడుతుంది. నెయ్యిని సహజసిద్దమైన ఫ్యాట్ గెయినర్‌గా ఉపయోగిస్తారు.  బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దూరమౌతాయి. ఆవు నెయ్యి త్వరగా జీర్ణమౌతుంది. జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది.


3. చలికాలంలో సాధారణంగా జీర్ణక్రియ బలహీనంగా మారుతుంది. దాంతో ఆహారం జీర్ణమయ్యేందుకు కష్టమౌతుంది. ఫలితంగా అజీర్తి సమస్య తలెత్తుతుంది. కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు జొన్న రొట్టి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ బలమౌతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.


Also read: Periods Miss Reasons: పీరియడ్స్ మిస్ ఎందుకవుతుంటాయి, దాని వెనుక కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook