Moong Dal Soup: దగ్గు, జ్వరానికి పెసర పప్పు సూప్.. దీంతో కలిగే ప్రయోజనాలు ఇవే!
Moong Dal Soup Recipe: ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని రకాల చూపులను తింటూ ఉంటాము. సూప్ ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకుంటాం.
Moong Dal Soup Recipe: ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు వివిధ వెజిటేబుల్స్ తో కూడిన సూప్ తీసుకోవడం ఎంతో మేలు కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. అయితే పెసరపప్పుతో చేసే సూప్‌ను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పెసరపప్పును తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. అంతేకాకుండా దీన్ని జ్వరం , దగ్గు , జలుబు ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు పెసర పప్పు , రెండు కప్పులు నీళ్లు, ఒక టేబుల్ నెయ్యొ, అర టేబుల్ స్పూన్ జీలక్రర, అర టేబుల్ స్పూన్ అల్లం తురుము, క్యారెట్, అర కప్పు గుమ్మడికాయ ముక్కలు , పావు కప్పు మిరియాలు, అల్లం పొడి , చిటికెడు వాము, ఉప్పు, మెంతి కూర
పెసర పప్పు సూప్‌ను తయారు చేసే విధానం:
పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టాలి తీసుకోవాలి. కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, తురిమిన అల్లం వేయాలి. పెసరపప్పుని వేసి వేయించాలి. తరువాత అందులో క్యారెట్, గుమ్మడికాయ ముక్కలని వేసి బాగా కలపాలి. నీళ్ళని పోసి మరోసారి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన తరవాత మిరియాలు, వాము, ఉప్పు, అల్లం పొడి వేసి బాగా కలపాలి. మెంతి కూరను వేసి గార్నిష్ చేయాలి.
దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఇలా పెసరపప్పుతో సూప్‌ను తయారు చేసి తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకుంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Cardamom: యాలకులతో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter