High Blood Pressure: ఆధునిక జీవనశైలి కారణంగా అనేక మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి ముఖ్యంగా చిన్న వయసులో కూడా చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యల బారిన పడడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. చాలామందిలో ఈ సమస్య రావడానికి కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు, జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడమెనని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీ సమస్య అనేది కొంతమందిలో ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కూడా వస్తోందని నిపుణులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక రక్తపోటు కారణంగా చాలామందిలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి ముఖ్యంగా కొంతమంది అయితే ప్రాణాంతక అనారోగ్య సమస్యలు బారిన కూడా పడుతున్నారు.. BP కారణంగా మొదట వచ్చే సమస్యల్లో గుండె జబ్బు ఒకటి. చాలామందిలో గుండెపోటు, మధుమేహం,  గుండెల్లో అకస్మాత్తుగా నొప్పి రావడం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ గా కూడా భావిస్తారు. ఎందుకంటే రక్తపోటు కారణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.


రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రక్తపోటు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను ప్రతిరోజు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు యాలకుల గింజలతో తయారు చేసిన పొడిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter