High Cholesterol: ఈ ఆకులు నమిలి తింటే, బాడీలోని కొవ్వు కడిగేసినట్లు శుభ్రం అవ్వడం ఖాయం!
Reduce Cholesterol: కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించండి.
Reduce Cholesterol: కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఆధునిక జీవనశైలిలో చిన్న సమస్యగా మారింది. నేటి జీవనశైలిని చాలామందిలో శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరిగిపోయి అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధిక కొవ్వు బారిన పడినవారు విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ధూమపానం, మద్యపానం కారణంగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. నిజానికి చాలామందిలో శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు నరాల్లో పేరుకుపోయి.. హార్ట్ ఎటాక్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలామంది దీని కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొవ్వును నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా రోజు తీసుకునే డైట్లో నిపుణులు సూచించిన కరివేపాకును వినియోగించడం వల్ల సులభంగా కొవ్వును కరిగించుకోవచ్చని వారు అంటున్నారు. కరివేపాకులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను కరిగించడమే కాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను కూడా సులభంగా బయటికి పంపిస్తాయి. అంతేకాకుండా దీనితో మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజు 10 నుంచి 15 కరివేపాకు ఆకులను స్వచ్ఛమైన వంటనూనెలో ఉడికించి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో 5 నుంచి 6 పచ్చి కరివేపాకులను నెమలి తినడం వల్ల కూడా సులభంగా కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా స్పీడ్ గా కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు ఒక గ్లాసు కరివేపాకు రసాన్ని తాగితే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు చేస్తే రక్తనాళాలు కూడా క్లీన్ అవుతాయని వారంటున్నారు. దీని కారణంగా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడి హార్ట్ ఎటాక్, గుండె దెబ్బతిన్నడం, ఇతర గుండె సమస్యలు రాకుండా ఉంటాయట.
అంతేకాకుండా కరివేపాకు రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఆకుల్లో ఉండే ఐరన్ రక్తాన్ని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి రక్తహీనత సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఈ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని ప్రతిరోజు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి