Tips for Preventing Knee Pain | గతంలో 60 ఏళ్ల, 70ఏళ్లు వచ్చాయంటే మొదలయ్యే సమస్యలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు. అయితే ఆధునిక జీవినశైలిలో మార్పులతో ఇప్పుడు మూడు పదుల వయసులోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వయసు పైబడిన వారు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. ఇందుకు ప్రధాన కారణం కీళ్ల దగ్గర తగినంత జిగురు లాంటి పదార్థం ఉండకపోవడం. దీన్ని అధిగమిస్తే ఎప్పుడైనా మోకాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెండకాయలో జిగురు ఉందని అది తింటే జిగురు వస్తుందని తింటుంటారు. నీ వీటివల్ల ప్రయోజనం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే జిగురు పదార్థాలు తింటే శరీరంలోని రక్తం జిగురు జిగురుగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఉప్పు అధికంగా తింటే మోకాళ్లు, కీళ్ల దగ్గర జిగురు అనేది రాకుండా ఉప్పుడు అడ్డుకుంటుంది, అప్పుడు కీళ్ల మధ్య రాపిడిలాగ అనిపించి మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. 30 ఏళ్లు, 40 ఏళ్లకు ఇప్పుడు కీళ్ల నొప్పులు రావడానికి ఇదే కారణం.  మోకాళ్ల సమస్య నివారణకు ఈ చిట్కాలు పాటించాలి. Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!


మోకాళ్ల సమస్యకు చిట్కాలు (Remedies for Knee Pain)


  • మొదటి సమస్య ఏంటంటే ఉప్పు... రుచి కోసం ఉప్పు వేసుకుంటున్నాం, తప్పదు కనుక కొద్ది మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి శ్రేయస్కరం. రుచి కోసం చూస్తే, మీరు అధికంగా తినే ఉప్పు మోకాళ్లలో, కీళ్ల వద్ద జిగురు ఉత్పత్తి అవకుండా అడ్డుకుంటుంది.

  • మనం అధికంగా తిన్న ఉప్పు బయటకు వెళ్లే అవకాశాలు తక్కువ. గతంలో లాగ శారీరక శ్రమ లేకుండా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాం. ఏసీలు, కూలర్లు పెట్టుకుని హాయిగా ఉంటాం. అలాంటప్పుడు మీరు తినే ఉప్పు కేవలం యూరిన్ రూపంలో బయటకు వెళ్లదు. దీంతో శరీరంలో పలు భాగాల్లో నిల్వ ఉండిపోయి మోకాళ్ల సమస్య అధికం అవుతుంది. Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది

  • ఉప్పు ఎక్కువ తింటారు కనుక సోడియం శరీరంలో అలాగే ఉండిపోతుంది. ఎక్కువైన ఉప్పును దానికి అడ్డులేని చోట ఉంచుతుంది. కేవలం కీళ్ల సందులలో, చిన్న, పెద్దపేగు గోడలలో నిల్వ అవుతుంది. దీంతో మోకాళ్లు, కీళ్ల నొప్పులతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలా వస్తువులు ఉప్పు తాకితే డ్యామేజీ అవుతాయి.

  • ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలి. చెమట వచ్చేలా కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు, యోగా, లేక వ్యాయామం, జిమ్ లాంటివి చేస్తే స్వేదం ద్వారా లవణాలు బయటకు వెళ్లిపోతాయి. కీళ్లు దగ్గర జిగురు నిల్వ ఉండేందుకు దోహం చేస్తుంది. దాంతో లేచినా, కూర్చున్నా జిగురు ఉండటం వల్ల కీళ్ల రాపిడి తగ్గి మోకాళ్ల నొప్పులు రావు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి

  • విటమిన్ సి కావాలనుకునే ఉప్పు పదార్థాలు అధికంగా తీసుకోరాదు. వారు నిమ్మరసం తాగాలి. విటమిన్ సి పుష్కలంగా లభించే.. పైనాపిల్, జామ, స్ట్రాబెర్రీ, కివి, మామిడి పండ్లను ఆయా సీజన్ ప్రకారం తినాలి. తద్వారా మోకాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. 

  • కొన్ని సీజన్లలో యూరిన్ (మూత్రం) ఎక్కువసార్లు వస్తుందని నీళ్లు తక్కువగా తాగుతారు. దీనివల్ల శరీరంలోని ఉప్పు బయటకు వెళ్లదు. ఈ తప్పు అసలు చేయవద్దు. దీనివల్ల కిడ్నీలో రాళ్లు సైతం ఏర్పడే సమస్య ఉంది. అప్పుడు మోకాళ్ల నొప్పులతో పాటు మరిన్ని అనారోగ్య సమస్యలు.

  • అధిక బరువు కారణంగానూ మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు వస్తాయి. కనుక కాస్త బరువు తగ్గడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు