Health Tips: ఉప్పు అధికంగా తింటే Heartకు ముప్పు అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Health Tips Salt Side Effects | రుచికోసం వాడే ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో మోతాదుకు మించి శరీరంలోకి ఉప్పు వెళ్తే అనారోగ్యానికి కారణంగా మారుతుంది. ముఖ్యంగా ప్యాకింగ్ చేసిన పదార్థాలలో ఉండే ఉప్పు మోతాదు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే తగిన మోతాదులో శరీరానికి సోడియం కావాలంటే ఉప్పు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) చెబుతోంది.
మనం తినే పలు ఆహార పదార్థాలలో ఉప్పు తిసుకుంటాం. రుచికోసం వాడే ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో మోతాదుకు మించి శరీరంలోకి ఉప్పు వెళ్తే అనారోగ్యానికి కారణంగా మారుతుంది. ముఖ్యంగా ప్యాకింగ్ చేసిన పదార్థాలలో ఉండే ఉప్పు మోతాదు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే తగిన మోతాదులో శరీరానికి సోడియం కావాలంటే ఉప్పు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) చెబుతోంది. అయితే ఎంత ఉప్పు తీసుకోవాలో తెలియక తమకు కావాల్సినంత, తమకు ఇష్టం వచ్చినంత మోతాదులో ఉప్పును తింటున్నారు.
ప్రతిరోజూ ఎంత ఉప్పు తినాలంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతిరోజూ 5 గ్రాములకు మించి సోడియం తీసుకోకూడదు. కనుక మీరు అధికంగా తినే ఉప్పు గుండె సంబంధిత సహా పలు అనారోగ్య సమస్యలకు కారణంగా మారవచ్చు. గుండెపోటు బారిన పడే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రజలు ఎంత మోతాదులో తినాలో తెలియక అధికంగా ఉప్పు (Salt Side Effects) తింటున్నారని, దాని వల్ల కలిగే ముప్పు ప్రజలకు అంతగా తెలియదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనామ్ ఘెబ్రియెసస్ అన్నారు.
Also Read: Eating more salt: ఉప్పు ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా ?
అధికంగా సోడియం తీసుకుంటే ఏమవుతుంది..
మనం తీసుకునే పలు ఆహార పదార్థాలో ఉప్పు ఉంటుంది. జీర్ణప్రక్రియతో పాటు శరీరంలో పలు ద్రవాలు స్రవించడానికి తగిన మోతాదులో ఉప్పు అవసరం. గతంలో సహజ సిద్ధంగా ఉండే ఉత్పత్తులు అధికంగా తినడం ద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు. కానీ ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా సమస్యలు వస్తున్నాయి. అధికంగా ఉప్పు తింటే అధిక రక్తపోటు (High BP) సమస్య, ఆపై అది గుండె జబ్బు(Heart Attack)లకు దారితీస్తుందన్నారు. రోజుకు 5 గ్రాములకు మించి ఓ వ్యక్తి ఉప్పు తీసుకోరాదని, ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఒక్కరూ 9-12 గ్రాముల ఉప్పు తింటున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
Also Read: Immunity power: ఇమ్యూనిటీని తగ్గించే ఆ అలవాట్లు ఏంటో తెలుసా..
ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య, గుండె సంబంధిత జబ్బులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు సాధ్యమైనంత తక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు, అనారోగ్య సమస్యలున్న వారు ప్రతిరోజూ కేవలం 3 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. సోడియం శరీరంలో ఉంటే అది రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది, తద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook