Diabetes Tips: మధుమేహం అనేది ఓ లైఫ్‌స్టైల్ వ్యాధి. జీన్స్ పరంగా కూడా సోకుతుంది గానీ అధికశాతం మధుమేహం కేసులు జీవనశైలి సక్రమంగా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే నమోదవుతున్న పరిస్థితి ఉంది. డయాబెటిస్ ఒకసారి సోకిందంటే ఇక జీవితాంతం వదిలిపెట్టదు. ఎప్పటికప్పుడు అలవాట్లు, లైఫ్‌స్టైల్, వ్యాయామంతో నియంత్రించుకోవల్సి ఉంటుంది. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం అనేది వయస్సుని బట్టి ఉంటుంది. సాధారణంగా అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ 110 దాటితే మధుమేహం ఉన్నట్టుగా భావించాలి. తిన్న తరువాత అయితే 140-160 దాటకూడదు. మధుమేహం నియంత్రించాలంటే మెడిసిన్ తీసుకోవడం ఒక్కటే సరిపోదు. డైట్‌పై పూర్తి నియంత్రణ ఉండాలి. ఏం తింటున్నామనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అనుమానముంటే ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.  ఫైబర్, లీన్ ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడమే కాకుండా వ్యాయామం లేదా వాకింగ్ తప్పకుండా చేయాలి. ఈ క్రమంలో డయాబెటిస్ రోగులు తప్పకుండా పాటించాల్సిన 6 జాగ్రత్తలు ఏంటో చూద్దాం


శరీరంలో కార్బోహైడ్రేట్లు మోతాదు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేవి మాత్రమే డైట్‌లో తీసుకోవాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కూరగాయలు, చిక్కుడు కాయలు వంటివి మంచి ఫలితాలనిస్తాయి. 


ఇక తీసుకునే ఆహారంలో ఎప్పుడూ ఫైబర్ అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు దోహదమౌతుంది. దీనికోసం కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో, సాయంత్రం స్నాక్‌లో కొన్ని పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.


ఇక లీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే చికెన్, చిక్కుడు కాయలు, లో ఫ్యాట్ పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ల ప్రభావం తగ్గుతుంది. 


ఇక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి హెల్తీ ఫ్యాట్స్ ఉండే వాల్‌నట్స్, అవకాడో, అంజీర్, ఆలివ్ నూనె డైట్‌లో ఉంటే మంచిది. దీనివల్లు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఫ్రై పదార్ధాలు, ప్రోసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. 


డైట్ సమయం పాటించాలి. ఇష్టమొచ్చిన సమయాల్లో తినడం చేయకూడదు. రోజూ ఓ క్రమ పద్ధతిలో నిర్ణీత సమయానికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ ఉండాలి. రోజూ  సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో స్నాక్ తప్పకుండా ఉండాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ 8 గంటల్లోపు పూర్తి చేయాలి. రాత్రి డిన్నర్ కూడా 8 గంటల్లోపు అయిపోవాలి. సమయానికి నిద్ర ముఖ్యంగా 7-8 గంటలు తప్పకుండా ఉండాలి


రోజూ తగినంత పరిమాణంలో నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసు నీళ్లు తప్పకుండా తాగాల్సి ఉంటుంది. వేసవిలో 10 గ్లాసుల వరకూ తాగితే మంచిది. దీనికితోడు రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా వాకింగ్‌కు కేటాయించాలి. ఈ ఆరు సూచనలు పాటిస్తే డయాబెటిస్ ఎప్పటికీ నియంత్రణలోనే ఉంటుంది. హద్దు దాటదు.


Also read: AP Heavy Rains Alert: జూన్ 2 లోగా ఏపీలో నైరుతి రుతుపవనాలు, ఈసారి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook