Health Tips | ప్రపంచంలో అత్యధిక పేషెంట్లను ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం (Diabetes). ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల షుగర్ వ్యాధి డయాబెటిస్ మనల్ని బానిసను చేసుకుంటోంది. అయితే తరుచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్‌ను మన దరి చేయనీకుండా చేయగలమని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవల్స్ (How to Control Your Blood Sugar) భారీగా తగ్గుతాయని గుర్తించారు. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కువగా మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నాం. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహం (Health Tips To Prevent Diabetes) ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాలపాటు నడవాలని సూచించారు. వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ కొలిచారు. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి


రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్ పేషెంట్ల రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12శాతం అధికంగా తగ్గిపోయాయి. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!


ఇక రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు రీసెర్చర్స్ వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు రిపోర్టులో తెలిపారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Deepthi Sunaina Photos: శారీలో దీప్తి సునైనా సిగ్గు, హొయలు