How To Increase Sperm Count In 11 Days: ప్రస్తుతం కొంతమంది పురుషులకు తండ్రి కావాలని కోరుక చిర కాలంగా మిగిలిపోతోంది. స్పెర్మ్ కౌంట్ సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఇవే సమస్యలే కాకుండా చాలా మందిలో శరీర బలహీనత సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యం గల ఆహారాలను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కూడా ఈ స్పెర్మ్ కౌంట్‌ను సులభంగా పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ఈ కౌంట్‌ను పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీర్యకణాల సంఖ్యను పెంచడానికి వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది:
1. కొబ్బరి గుల్లలు:

కొబ్బరి గుల్లలను కామోద్దీపన ఆహారంగా కూడా పిలుస్తారు. ఇందులో జింక్‌ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో పోషకాలు కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి సులభంగా స్పెర్మ్ కౌంట్, వీర్యం వాల్యూమ్ పెంచుతుంది. పురుషుల సంతానోత్పత్తిని కూడా పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుల్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి రోజు పౌల్ట్రీ, డైరీ, గింజలు, గుడ్లు, తృణధాన్యాలు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు


2. విత్తనాలు:
గుమ్మడికాయ గింజలు కూడా వీర్యకణాల సంఖ్యను పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందలో అధిక పరిమాణంలో జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లభిస్తాయి. కాబట్టి సులభంగా స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఫ్యాటీ యాసిడ్స్‌ అధిక పరిమాణంలో ఉండే  అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి సులభంగా శరీరాన్ని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. 


3. దానిమ్మ రసం:
దానిమ్మ రసంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల మగ సంతానోత్పత్తిని మెరుగుపడుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. స్పెర్మ్ నాణ్యతను పెంచుకోవాలనుకునేవారు తప్పకుండా దానిమ్మ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుంది. 


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook