Hyderabadi Biryani: హైదరాబాద్ ఫేమస్ డిష్ బియ్యాని తయారు చేసుకోండి ఇలా!
Hyderabadi Biryani Recipe: హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేవి ఒకటి చార్మినార్ మనం అందరికి ఇష్టమైన బిర్యాని. బిర్యాని అంటే ఇష్టపడానికి వారు ఉండరు. వీకెండ్స్‌లో కూడా ఈ బిర్యాని కోసం తెగ ఎగబడి తింటాము. అయితే ఈ బిర్యాని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Hyderabadi Biryani Recipe: వీకెండ్స్‌లో మీ ఇంట్లో ఈ హైదరాబాద్ బియ్యాని తయారు చేసుకొని తినవచ్చు. అయితే బిర్యానీ రుచి మొత్తం మనం కలిపే చికెన్ మిశ్రమం , వాడూ మసాలాలు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన విధానంగా మీరు బిర్యానీ ట్రై చేస్తే మళ్లీ మళ్లీ తినాలని పిస్తున్నాయి.
బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:
దాల్చిన చెక్కలు, లవంగాలు ఆరు, ఆరు యాలకులు, ఒక టేబుల్ స్పూన్ షాజీరా , 1/4 ముక్క జాజికాయ, ఒక అనాస పువ్వు, మూడు బిర్యానీ కా ఫూల్ , మూడు మరాఠీ మొగ్గు చిన్నవి, ఒక జాపత్రి
మారినేషన్ కొరకు కావాల్సిన పదార్థాలు:
750 గ్రాములు చికెన్ , బిర్యానీ కట్, 1/2 tsp పసుపు పొడి, ఉప్పు , మూడు కారం, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి మద్దు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు , ఉల్లిపాయలు,
గడ్డ పెరుగు, నిమ్మకాయ, ఆరు నూనె, నెయ్యి, బాస్మతి బియ్యం, నీళ్ళు , మసాలా దినుసులు
హైదరాబాద్ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలి:
ముందుగా బిర్యానీకి బాస్మతి బియ్యం తీసుకోవాలి. దీని అరగంట సేపు నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాను తయారు చేసుకోవాలి. దీని కోసం దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా , జాజికాయ, అనాసపువ్వు, బిర్యానీ పువ్వు, మరాఠీ, జాపత్రి, అనాస పువ్వు అన్నింటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలను చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దీని డీప్ ఫ్రైకి సరిపడా నూనె కాచి, ఉల్లిపాయను గోధుమరంగులోకి వేచ్చేవారుకు వేయించుకోవాలి.
అనంతరం చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, రెండు బిర్యానీ మసాలా, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, పెరుగు, పచ్చి మిర్చి పేస్ట్, పుదీనా ఆకులు వేసి బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
Also Read Natural Skin Glow: పండుగలలో, పెళ్లిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఈ జ్యూస్ బెస్ట్
ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు, మసాలా దినుసులు, పుదీనా ఆకులు, బిర్యానీ ఆకు వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోని మళ్ళీ మరిగించుకోవాలి. మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వార్చేయాలి. బిర్యానీని గిన్నెలో అంచులకు నూనె రాసి ఆరు స్పూన్‌ల కాచిన నూనె, రెండు స్పూన్‌ల నెయ్యి వేయాలి. అందులో నానబెట్టిన చికెన్ వేసి పైన సగం ఉడికించిన అన్నం వేసుకోవాలి. అన్నం పైన పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి. దీనిని అల్ల్యుమినియం ఫాయిల్ తో కవర్ చేసుకోవాలి. బరువైన వస్తువును దీని మీద పెట్టుకోవాలి. ఈ విధంగా బిర్యానీ తయారు చేసుకొని తినాలి.
Also Read Cloves: అధిక రక్తపోటు సమస్యకు ఇలా చెక్ పెట్టిండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter