Instant Dosa recipe: దోశలు ఎంతో రుచిగా ఉంటాయి. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బయట చేసే దోశను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే అది శరీరానికి అంత మంచిది కాదు. అయితే ఇంట్లో తయారు చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. అయితే కేవలం ఐదు నిమిషాల్లో ఇన్‌ స్టాంట్‌ దోశను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దీని కోసం ఇంట్లో లభించే పదార్ధాలు సరిపోతాయి. దీని బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు బ్రేక్‌ ఫాస్ట్‌గా దీని ఇవ్వచ్చు. ఆఫీస్‌కు లేట్‌ అవుతుంది అని అనుకునేవారు ఈ ఇన్‌ స్టాంట్‌ దోశను ఐదు నిమిషాలలో తయారు చేసుకొని తినవచ్చు. రాత్రి భోజనం కోసం కూడా  తయారు చేసుకోవచ్చు.  ఈ దోశ తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. అలాగే రాత్రి పూట భోజనం చేయని వారు ఈ  దోశలను తినవచ్చు. దీని వల్ల బరువు పెరిగే అవకాశం లేదు. కాబట్టి సింపుల్‌ గా దీని తయారు చేసుకోవచ్చు.  అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ స్టాంట్ దోశకి కావాల్సిన పదార్థాలు:


రెండు కప్పులు బియ్యం పిండి


ఒకటిన్నర కప్పు పెరుగు 


ఒక కప్పు నూనె 


ఉప్పు 


నీళ్లు


ఇన్ స్టాంట్ దోశ తయారు చేసే విధానం:


ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులోకి ఉప్పు, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో నీరు పోసుకోవాలి. దీని దోశ పిండిలా చేసుకొని పెనంపై నూనె పోసి దోశలు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోశ తయారువుతుంది. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. బ్రేక్‌ ఫస్ట్‌లో ఈ దోశ ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే దీని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కేవలం ఐదు నిమిషాలలో ఈ దోశను తయారు చేసుకోవచ్చు. 


Also Read:  Silver Anklets: పాదాలకు బంగారం పట్టీలు ఎందుకు ధరించకూడదు ? కలిగే నష్టాలు ఏంటి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter