Onion Pakoda Recipe: సాయంత్రం వేడి వేడి తినాలి అనిపించినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఉల్లిపాయ పకోడా. కొన్నిసార్లు అనుకోని అతిథులు ఇంటికి వచ్చినప్పుడు లేదా స్నేహితులు  వచ్చినప్పుడు వేంటనే రెడీ చేసుకొనే రెసిపీ ఈ ఉల్లిపాయ పకోడా. ఇది ఎంతో రుచి కరంగా ఉంటుంది. దీని కెచప్‌తో  తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఉల్లి పాయ పకోడాను మహారాష్ట్రలో ఖేక్డా భాజీ అని ప్రేమగా పిలుస్తారు. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా సాయంత్రం ఏదైన వేడి వేడి తినాలి అంటే ముందుగా దీని రెడీ చేసుకోండి. ఇంట్లో ప్రతిఒక్కరు దీని ఇష్టంగా తింటారు. అయితే ఈ వంట కోసం సాధారణ వస్తువులు ఉంటే సరిపోతుంది. మనం ప్రతిరోజు ఉపయోగించే పదార్థాలతో చేసుకుంటే సరిపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉల్లిపాయ పకోడా కావలసిన పదార్థాలు: 


ఉల్లిపాయ రెండు కప్పులు


ఒక కప్పు శనగపిండి 


పచ్చిమిర్చి 


కొత్తిమీర 


ఉప్పు 


బేకింగ్ సోడా చిటికెడు 


నీళ్లు తగినన్ని 


కారం కొంచెం 


నూనె 


ఉల్లిపాయ పకోడా తయారీ విధానం:


ముందుగా  ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వత శనగ పిండి, కొత్తిమీర తురుము, కరివేపాకులు చిన్నగా కత్తిరించి వేసుకోవాలి.తరువాత  ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా ,  కారం వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. 


స్టవ్ ఫై బాణలి పెట్టుకుని సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడి తర్వాత శనగపిండి  చేతిలోకి తీసుకుని  చిన్నగా వేసుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా  పకోడీలను వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. పిల్లలు దీని అసలు వద్దన్నారు. దీని టీ బ్రేక్‌లో కూడా తినవచ్చు. అతి తక్కువ నూనెతో కూడా దీని చేసుకొని తినవచ్చు.  మీ స్నేహితులు కూడా వీటిని ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పుకుండా ఈ పకోడా ట్రై చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు.


Also Read Weight Loss: వాల్‌నట్స్‌తో కూడా బరువు, BPని తగ్గించుకోవచ్చు..ఇలా చేయండి రోజు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter