Walnuts for Weight Loss and BP: ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ పొట్టతో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో శరీరానికి కావాల్సిన అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తీసుకోవడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వాల్ నట్స్‌ను అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఖాళీ కడుపుతో తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. వాల్‌నట్స్‌లో విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుంది. ప్రతి రోజు వాల్‌నట్స్ తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
వాల్‌నట్‌లో గుండెకు కావాల్సిన మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె సమస్యల బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా గుండెపోటు, నరాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాల్‌నట్స్‌ను తినడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
మతిమరుపు:
ప్రతి రోజు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మతిమరు వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు మెదడులో నరాలను బలంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా మెదడులోని వాపు తగ్గుతుంది.
బరువు తగ్గడానికి:
వాల్‌నట్స్‌లో అధిక పరిమాణంలో ఫైబర్ గుణాలు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో పీచు పదార్థాలు అధిక పరిమాణంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఉదయం పూట తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అధిక బీపీ:
రక్తపోటును నియంత్రించేందుకు కూడా వాల్‌నట్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె పనితీరును మెరుగుపరుచుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా వాల్‌నట్స్‌ను తీసుకోవాలి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter