COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Health Benefits Of Sleeping Nude: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే మాత్రమే సరిపోదు. ఆహారాలతో పాటు ప్రశాంతమైన నిద్ర కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కష్టపడి పని చేసేవారు అలసిపోయిన తర్వాత రోజు ప్రశాంతమైన నిద్రను కోరుకుంటారు. నిద్ర మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా 8 నుంచి 9 గంటల పాటు నిద్ర చాలా ముఖ్యం. అంతేకాకుండా కొంతమంది నిద్రను చాలా ఇష్టపడి ఎక్కువ సేపు పడుకుంటూ ఉంటారు. ఇక చాలి కాలంలోనైతే చెప్పన్నకర్లేదు. తొందరగా పడుకుని లేటుగా లేస్తూ ఉంటారు. 


శీతాకాలంలో చాలా మంది వెచ్చధనాన్ని పొందడానికి పెద్ద పెద్ద దుప్పట్లను ధరించి నిద్రపోతారు. ఈ సమయంలో చాలా మంది చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి లావుగా ఉండే బట్టలను ధరిస్తారు. అయితే ఈ చలి కాలంలో శరీరంపై ఎలాంటి దుస్తువులు ధరించకుండా పడుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నగ్నంగా పడుకోవడం వల్ల శీతాకాల్లో అనేకయ రకాల ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 



రక్త ప్రసరణను మెరుగుపడుతుంది:
శీతాకాలంలో నగ్నంగా పడుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. అందులో మొదట కలిగే లాభం శరీర రక్త ప్రసరణ మెరుగుపడడమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రిపూట బిగుతుగా ఉండే బట్టలు ధరించడం వల్ల చాలా మందిలో రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా కొందరిలో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు నగ్నంగా పడుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో నగ్నంగా పడుకోవడం వల్ల శరీరంలో  ఆక్సిజన్, పోషకాల స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు కాంతివంతమైన చర్మంతో పాటు మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందుతారు. 


బాడీ టెంపరేచర్‌ కంట్రోల్‌లో ఉంటుంది:
చలికాలంలో బట్టలు లేకుండా నిద్రపోతే  శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వేడెక్కడం, అధిక చెమటలు పట్టడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు పొడి జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


బరువు తగ్గడం:
బట్టలు లేకుండా నగ్నంగా పడుకోవడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కేలరీలు, కొలెస్ట్రాల్‌ బర్న్‌ అయ్యే మూలకాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. దీంతో పాటు శరీర ఉష్ణోగ్రతలు కూడా స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం:
నగ్నంగా పడుకోవడం వల్ల ప్రైవేట్ ఫాట్స్‌ వద్ద తేమ, వేడి స్థాయిలు తగ్గుతాయి. దీని కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్‌లు వృద్ధి చెందకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈస్ట్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మొటిమలు వంటి చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు చాలా మందిలో ఇన్ఫెక్షన్లన్నీ చికాకు, వాపు, గాయాలు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. 


మానసిక స్థితి మెరుగుపడుతుంది:
బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల సుఖవంతమైన నిద్ర పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బట్టల ఒత్తిడి కారణంగా వచ్చే అనేక రకాల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు మానసిక స్థితి, శక్తి, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి మానసిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నగ్నంగా పడుకోవడం చాలా మంచిది. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook