Depression Causes: శరీరంలో పోషకాలు తగ్గాయంటే మీ లైఫ్ రిస్క్‌లో ఉన్నట్లే!!
Tips For Depression Recovery: డిప్రెషన్ ప్రస్తుతకాలంలో చాలా మందని వేధించే సమస్య. డిప్రెషన్ కారణంగా చిన్న వయసులోనే జీవితాలను కోల్పుతున్నారు. అయితే డిప్రెషన్ కేవలం ఒత్తిడి వల్ల కాకుండా మనం శరీరంలో కొన్ని పోషకాలు తగ్గడం వల్ల ఈ సమస్య బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Tips For Depression Recovery: డిప్రెషన్ అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య, ఇది ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం, ఆసక్తి కోల్పోవడం, నిరాశ ఇతర శారీరక, భావోద్వేగ లక్షణాలకు మూల కారణం. దీని వల్ల చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు పౌష్టికాహార లోపం కూడా ఒక ముఖ్యమైన కారణం. అందులోనూ విటమిన్ డి లోపం మానసిక ఆరోగ్యాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
విటమిన్ డి సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ హార్మోన్ మన మానసిక స్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెరోటోనిన్ తక్కువగా ఉంటే డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డి మెదడులోని నరాల కణాలను రక్షిస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ డి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. మంట ఎక్కువగా ఉంటే మానసిక సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది.
మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మన శరీరం, ముఖ్యంగా మన మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ రెండూ రక్తపోటు నియంత్రణ, గుండె ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం కోసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెగ్నీషియం రక్తనాళాలను విశ్రాంతి చేయడంలో సహాయపడుతుంది, దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె కండరాలను బలపరుస్తుంది, అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డిప్రెషన్, ఆందోళన ఇతర మానసిక రుగ్మతల లక్షణాలను తగ్గిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణజాలాన్ని రక్షిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది వయసుతో సంబంధం ఉన్న మెదడు క్షీణతను నిరోధిస్తుంది. డిప్రెషన్, బైపోలార్ డిస్‌ఆర్డర్, ADHD లక్షణాలను తగ్గిస్తుంది. దీని వల్లట్రైగ్లిసరైడ్స్‌ను తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టడాన్ని. రక్తపోటును తగ్గిస్తుంది. శరీలంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
మెగ్నీషియం-ఒమేగా-3లను ఎలా పొందాలి:
మెగ్నీషియం: పాలకూర, బాదం, అవోకాడో, బనానా, బ్రౌన్ రైస్, చియా గింజలు, డార్క్ చాక్లెట్, మొక్కజొన్న, గోధుమలు, గ్రీన్ బీన్స్, లెంటిల్స్, సోయాబీన్స్, వాల్‌నట్‌లలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: సాల్మన్, ట్యూనా, మాకెరెల్, సార్డినెస్, హెర్రింగ్, చియా గింజలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు, గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యమైన విషయం:
ఏదైనా సప్లిమెంట్‌ను తీసుకోవడానికి ముందు మీ డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
Also read: Ajwain Leaves: వాము మొక్క లాభాలు ఏంటి.. ఇంట్లోనే ఇలా పెంచుకోవచ్చు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter