Weight Gain Yoga Asanas: బరువు తగ్గడం ఎంత కష్టమో.. శరీర బరువును పెంచుకోవడం కూడా అంతే కష్టం. అనారోగ్య కారణాలవల్ల బరువు తగ్గిన వారు శరీర ఆకృతిని పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు పెరగలేకపోతున్నారు. కొంతమంది అయితే మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినప్పటికీ శరీర బరువు పెంచుకోలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆరోగ్య నిపుణులు సూచించిన పలు యోగాసనాలు వేయాల్సి ఉంటుంది. ఎలాంటి యోగాసనాలు వేయడం వల్ల సులభంగా బరువు పెరుగుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రతిరోజు ఈ ఆసనాలు వేయడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు:


భుజంగాసనం:
యోగా చేయడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు ఎముకలు, కండరాలు కూడా దృఢంగా కూడా మారుతాయి. ప్రతి రోజు భుజంగాసనం వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా సులభంగా మెరుగుపడుతుంది. కష్టం లేకుండా బరువు పెరగాలనుకునేవారు ప్రతిరోజు భుజంగాసనం వేయాల్సి ఉంటుంది. 


Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..


ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనం తప్పకుండా చేయాలి:
ఈరోజు భోజనం చేసిన తర్వాత వజ్రాసనం స్థితిలో కూర్చోవడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాకుండా మనశ్శాంతి కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు భుజంగాసనం వేస్తే మంచి ఫలితాలు పొందుతారు.


పవన్ముక్తాసనం:
శరీర బరువును పెంచేందుకు పవన్ముక్తాసనం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ప్రతిరోజు వేయడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.


విశ్రాంతి తీసుకోవడం అవసరం:
సన్నగా ఉండేవా వారు కష్టపడి పనిచేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత అస్సలు కష్టపడి పని చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. శరీర ఆకృతిని పొందాలనుకునేవారు ప్రతిరోజు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి