Stress Control: హడావిడి జీవనశైలి.. అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలామంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ,ఊబకాయం, హై బీపీ , తలనొప్పి ,మెడ నొప్పి.. ఇలా ప్రతి చిన్న పెద్ద సమస్య ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. అయితే వీటిని తగ్గించుకోవడం కోసం ఎక్సర్సైజ్, యోగ చేయడానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ముందు చేయాల్సింది శారీరక శ్రమ కాదని ..మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని మెదడుని బలపరచాలని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒత్తిడి కారణంగా ఇప్పుడు మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అవి గుర్తించక ప్రతి వాళ్లు తమ స్ట్రెస్ అవతల వాళ్ళ పై తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా అసహనం పెరిగిపోవడమే కాకుండా క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు. ఆధునిక వసతులు పెరుగుతున్న కొద్దీ.. ప్రజలు ఇంటి భోజనం తినడమే గగనం అయిపోతుంది. అనారోగ్యకరమైన అలవాట్లు ఎక్కువ చేసుకోవడం వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురి అవుతున్నారు. కొంతమంది స్ట్రెస్ తగ్గించడం కోసం స్ట్రెస్ ఈటింగ్ పేరుతో నానా చెత్త తిని లేనిపోని సమస్యలు నెత్తికి తెచ్చుకుంటున్నారు.


మానసికమైన ఆరోగ్యం శరీరాన్ని బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మానసికమైన ఆరోగ్యం మెండుగా ఉండాలి అని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఎక్కువ స్ట్రెస్ కొన్నిసార్లు డిప్రెషన్ కి కూడా దారితీస్తుంది. అంతేకాకుండా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి హై బీపీ ,గుండె సంబంధిత సమస్యలు సులువుగా వస్తాయి. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న షుగర్ కేసులకు ఆహారపు అలవాట్లు ఒక కారణమైతే అధిక స్ట్రెస్ మరొక కారణం.


ప్రస్తుతం పెరుగుతున్న పని భారం కారణంగా సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అలవాట్లకు బానిసలు అవుతున్నారు. వీటి నుంచి బయటపడాలి అంటే సెలవు దొరికిన రోజు ఇంటికి పరిమితం కాకుండా ఆహ్లాదంగా ప్రకృతి మధ్యలో కాస్త సమయం గడపడానికి ప్రయత్నించాలి. మన అనుకున్న వ్యక్తులతో నవ్వుతూ మాట్లాడడం.. ఇంటిలో కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం.. సరదాగా బయటకు వెళ్లడం.. లాంటి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మానసికంగా ఉత్తేజంగా ఉంటాము. మీ ఆరోగ్యమే కాదు మీ కుటుంబానికి కూడా మీ చేతుల్లోనే ఉంది కనుక వీలైనంత త్వరగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


గమనిక: ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 


Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter