Coriander Infusion Decoction for Constipation: అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల చాలామందిలో పొట్ట సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం పొట్టలో మంట గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. అయితే ఈ సమస్యలతో పాటు కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో చాలా రకాల రసాయనాలతో కూడిన మందులు ఉన్నాయి. వాటిని వినియోగించడం వల్ల ఫలితాలు పొందినప్పటికీ కొంతకాలమే అవి మీకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే శాశ్వతంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిన్న చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల పై పొట్ట సమస్యలు తగ్గుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయం పూట కేవలం తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్ ఆధారిత ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని అంతేకాకుండా పై సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ధనియాలతో తయారుచేసిన కషాయాన్ని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ కషాయాన్ని ఆయుర్వేద నిపుణులు సూచించిన మేరకు పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. 


Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!


ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన ధనియాల కషాయాన్ని తయారు చేయడానికి ముందుగా రెండు టీ స్పూన్ల ధనియాలను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఉదయాన్నే నానబెట్టిన ధనియాలని తీసుకొని ఓ బౌల్లో పోసి కషాయంలో మరిగించాల్సి ఉంటుంది. ఇలా 20 నిమిషాల పాటు మరిగిన తర్వాత.. ఓ గ్లాసులోకి తీసుకొని పైనుంచి చియా సీడ్స్ గార్నిష్ చేసుకొని ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా పొట్ట సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా శరీరానికి రోగనిరోధక శక్తి కూడా లభిస్తుంది. 


Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook