Knees And Joints Pain Relief Home Remedies: ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారైతే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే ఖరీదైన ఔషధాలను వినియోగించడమే కాకుండా వివిధ రకాల ట్రీట్మెంట్లను కూడా చేయించుకుంటున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారట. అంతేకాకుండా వీటిని వినియోగించడం వల్ల ఇతర దుష్ప్రభావాల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ కీళ్ల నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని సూచనలు, చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయుర్వేద శాస్త్రంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులకు ఎన్నో ఔషధ మూలికలు ఉన్నాయి. అందులో పూర్వీకులు వినియోగించిన వాటిలో ఆముదం ఒకటి. ఈ ఆముదాన్ని వినియోగించి సులభంగా మోకాళ్ళ నొప్పులతో పాటు కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా ఈ నొప్పులతో బాధపడేవారు ఆముదం ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని వినియోగించవచ్చు. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆముదం చెట్టు ఆకులను మిశ్రమంలో తయారు చేసుకొని..నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి కాటన్ గుడ్డతో కట్టు కట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వినియోగిస్తే నొప్పి తీవ్రత కూడా సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా తరచుగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఆముదం నూనెను మోకాళ్లపై అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ పొందుతారు. అంతేకాకుండా శాశ్వతంగా మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి